బిజినెస్

విశాఖపట్నంలో నేషనల్ ట్రాన్స్‌పోర్టు ఇనిస్టిట్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: విశాఖలో నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్టు రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. రెండు రోజుల పాటు జాతీయ రహదారి భద్రతపై జరిగే వర్క్‌షాప్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గురువారం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాతూ ట్రాన్స్‌పోర్ట్ ఇనిస్టిట్యూట్ ప్రతిపాదనలు కేంద్రానికి నివేదించినట్టు తెలిపారు. దీనికోసం రూ.700 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇదే ఇనిస్టిట్యూట్ నిమిత్తం ముంబై పట్టణం కూడా ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు జరిగే సదస్సులో పూర్తి స్థాయిలో చర్చించనున్నట్టు మంత్రి తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా నుంచి ప్రతినిధులు, కన్సల్టెంట్‌లు ఈ సదస్సుకు హాజరవుతున్నారన్నారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, కమిషనర్లు సదస్సులో పాల్గొంటారన్నారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో పలు అంశాలను చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ సదస్సు ద్వారా దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త రూపునిచ్చేందుకు అవకాశం కలుగుతుందన్నారు.