బిజినెస్

15 బిలియన్ డాలర్లకు ‘ఎండ్ యూజర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో 3ఎండ్ యూజర్2 కోసం భారత కంపెనీలు చేస్తున్న ఖర్చులు 2019లో సుమారు 10 శాతం పెరిగే అవకాశాలున్నాయి. ఈ మొత్తం ఖర్చు 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని సోమవారం నాడిక్కడ విడుదలైన అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ గార్ట్‌నర్2 అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రధానంగా వాణిజ్యపరమైన ఔట్‌సోర్సింగ్ రంగంలో ఈ ఖర్చు వేగంగా పెరుగుతోంది. ఈ రంగంలో ఈ ఏడాది 14 శాతం అంటే 1.9 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. స్థూల ఆదాయాభివృద్ధిలో గణనీయ ప్రగతిని సాధిస్తున్న దేశీయ సంస్థలు వాటి వౌలిక వసతులను, డిజిటల్ వ్యవస్థలను క్లౌడ్‌కు చేరువగా విస్తరిస్తున్నాయని ఆ అధ్యయన సంస్థ పరిశోధనా విభాగం ఉపాధ్యక్షుడు అరూప్ రాయ్ పేర్కొన్నారు. కాగా సాంప్రదాయేతర రంగాలైన లాజిస్టిక్స్, రవాణా, తయారీ రంగాలు ఈ విషయంలో గణనీయమైన, ఆరోగ్యప్రదమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ రంగాల వాణిజ్య మోడళ్లు క్రమంగా సమాచార సంకేతికతను సంతరించుకుంటున్నాయి. ఇక 3బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్‌సోర్సింగ్2 (బీపీఓ) విభాగంలో అత్యధికంగా ఇళ్ల నుంచే పనిచేయడం (డబ్ల్యుఏహెచ్) లేదా టెలీ వర్కింగ్‌తోబాటు 3గిగ్ ఎకానమీ2ల ద్వారా వినియోగదారుల నియంత్రణ (సీఎం) 2021 నాటికి బీపీఓ వర్క్ఫోర్స్ 40 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. 2017లో ఇది కేవలం 7శాతానికే పరిమితం అయింది. 2021 నాటికి సుమారు 9 కోట్ల మంది ప్రజలను ఇది ప్రభావితం చేస్తుందని, ఇందులో కనీసం రెండు నుంచి మూడు భాగాల జనం సీఎం బీపీఓ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఉపాధిని పొందుతారని, మిగిలిన వారు ఎండ్ యూజర్ కంపెనీల ద్వారా నేరుగా ఉపాధిని పొందుతారని ఆ నివేదిక పేర్కొంది. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ప్రత్యేక నైపుణ్యం గలవారికి ప్రధాన లబ్ధి వర్క్ అట్ హోం (డబ్ల్యుఏహెచ్) లేదా టెలీ వర్కింగ్‌లతోబాటు గిగ్ ఎకానమీల్లోకి ప్రవేశాల ద్వారా జరుగుతుంది. కొన్ని క్లిష్టతర వాణిజ్య పరిస్థితులను అధిగమించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆ నివేదిక పేర్కొంది. యాజమాన్య నిర్వహణ సేవలు, క్లౌడ్ వౌలిక వసతుల సేవల్లో మన దేశంలో ఐటీ సర్వీసుల్లో కంపెనీల పెట్టుబడులు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని నివేదిక తెలిపింది.