బిజినెస్

ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 4 శాతం పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసిన నాల్గవ త్రైమాసిక ఆదాయాలు పెట్టుబడిదారుల సెంటిమెంటును ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో స్టాక్‌మార్కెట్‌లో మంగళవారం ఆ బ్యాంకు వాటాలు 4 శాతం మేర పతనమయ్యాయి. జాతీయ స్టాక్ మార్కెట్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ సంస్ధకు చెందిన ఒక్కోవాటా విలువ 3.77 శా తం తగ్గిపోయి రూ.384 వద్ద ట్రేడైంది. బీఎస్‌ఈలో సైతం ఈవాటా 3.76 శాతం తగ్గిపోయి ఒక్కోవాటా రూ.386.20గా మొత్తం 20.15 లక్షల వాటాలు ట్రేడయ్యాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 4 కోట్ల వాటాలు ట్రేడయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన నాల్గవ త్రైమాసికంలో ఈ బ్యాంకు 2.45 శాతం అదనపు లాభాలను గడించింది. సోమవారం ఈమేరకు ఈప్రైవేటు బ్యాంకు త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గడచిన జనవరి నుంచి మార్చి వరకు మొత్తం రూ.1,170 కోట్ల లా భాలను ఆర్జించినట్టు ఆ బ్యాంకు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఈ బ్యాంకు రూ. 1,142 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో మొత్తం రూ.36,784.25 కోట్ల ఆదాయాన్ని ఆ ర్జించినట్టు, గతేడాది ఇదే కాలంలో రూ. 33,784.25 కోట్ల ఆదాయం వచ్చిందని ఈ బ్యాంకు తన రెగులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. బ్యాంకు ఆస్తులు త్రైమాసికంగా పెగరడంతోబాటు నిరర్ధక ఆస్తులు 6.70 శాతం తగ్గాయని వివరించింది.