బిజినెస్

ఎవరిని నియమిద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్‌గా ఎవరిని నియమించాలన్న అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రధాని మోదీతో సమావేశమై దాదాపు గంటసేపు సుదీర్ఘ చర్చ జరిపారు. ప్రస్తుతం ఆర్‌బిఐ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రఘురామ్ రాజన్ పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో జైట్లీ గురువారం ప్రధానితో సమావేశమయ్యారు. రాజన్ మూడేళ్ల పదవీ కాలం వచ్చే నెల 4వ తేదీతో ముగియనుండటంతో ఆయన వారసుడిగా ఆర్‌బిఐ గవర్నర్ పదవి కోసం పోటీపడుతున్న పలువురు వ్యక్తుల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా ఎవరిని నియమిస్తున్నారని విలేఖర్లు జైట్లీని ప్రశ్నించగా, ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, దీనిపై నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రితో చర్చించి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ను ప్రధాని ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రెండోసారి తనను ఎంపిక చేయాలని కోరబోనని, మళ్లీ అధ్యాపక వృత్తిని చేపడతానని రఘురామ్ రాజన్ రెండు నెలల క్రితమే సంచలన ప్రకటన చేసి మార్కెట్లను ఆశ్చర్యపరిచారు. 1991లో ఆర్థిక సరళీకరణ శకం ప్రారంభమైన తర్వాత అత్యంత తక్కువ కాలం పాటు ఆర్‌బిఐ గవర్నర్ పదవిలో ఉన్న రాజన్‌పై బిజెపి ఎంపి సుబ్రమణియన్ స్వామి పదేపదే రాజకీయ విమర్శలు గుప్పించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్‌బిఐ గవర్నర్ పదవి కోసం ప్రస్తుత డిప్యుటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యుటీ గవర్నర్ సుబిర్ గోకర్ణ్ ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఆర్‌బిఐ డిప్యుటీ గవర్నర్‌గా పటేల్ పదవీ కాలాన్ని జనవరిలో మరో మూడేళ్లు పొడిగించగా, గోకర్ణ్ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్టు కౌశిక్ బసు, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య కూడా రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవికి రేసులో ఉన్నారు.