బిజినెస్

భారతీయ స్టాక్ మార్కెట్లకు ఐదోరోజూ ట్రం‘పెట్టు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా ఐదోరోజైన మంగళవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు విఫలమవుతాయన్న భయాందోళనలు కొనసాగడంతోబాటు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దృష్టి నిలిపిన మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. సెనె్సక్స్ 324 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయింది. ‘అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమ’ని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టైన్ లాగార్డె పేర్కొనడం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితులు దేశీయ ఇనె్వస్టర్లను సైతం భయపెట్టడంతో మంగళవారం వాటాల అమ్మకాల వత్తిడి పెరిగింది. ప్రధానంగా సెనె్సక్స్ ప్యాక్‌లో టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 4.60 శాతం నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ త్రైమాసిక ఫలితాలు మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేయడంలో విఫలమయ్యాయి. ఈక్రమంలో ఈ రెండు సంస్థలూ మంగళవారం రోజంతా వాటాల అమ్మకాల వత్తిడితో సతమతమయ్యాయి. 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 323.71 పాయింట్లు కోల్పోయి సుమారు 0.84 శాతం నష్టాలతో 38,276.63 వద్ద దిగువన ముగిసింది. ఒక దశలో ఈసూచీ 38,236.18 పాయింట్ల కనిష్ట స్ధాయికి చేరింది. ఇలా వుండగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 100.35 పాయింట్లు పతనమై 11,500 దిగువకు చేరుకుంది. రోజంతా ఊగిసలాడిన ఈ సూచీ ఒక దశలో 11,497.90 పాయింట్ల కనిష్ట స్థాయికి, మరో దశలో 11,657.05 పాయింట్ల ఎగువకు చేరుకుంది. ఇలావుండగా సెనె్సక్స్ ప్యాక్‌లో హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో 1.37 శాతం లాభాలను సంతరించుకున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల వైఫల్యం గత రెండు రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేసిందని, అంతేకాకుండా ప్రస్తుతం వెలువడుతున్న కొన్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మదుపర్లను ప్రోత్సాహపరిచేలా లేవని ప్రముఖ వాణిజ్య విశే్లషకుడు జగన్నాథం తుంగుంట పేర్కొన్నారు. గత ఆదివారం నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తులపై 200 బిలియన్ డాలర్ల సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. అపోహలు, ట్వీట్లతో ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేయడం తగదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ పేర్కొన్నారు. ఇలావుండగా చైనా స్టాక్ మార్కెట్ సూచీ షాంఘై మంగళవారం మళ్లీ లాభాల బాట పట్టింది. ఐతే జపాన్, కొరియా ఈక్విటీలు మాత్రం నష్టాల్లో కొనసాగాయి. అలాగే ఐరోపా స్టాక్ మార్కెట్లు మంగళవారం ఆరంభదశలో నష్టాల్లోనే సాగాయి. ఇక రూపాయి విలువలో ఎలాంటి ఎదుగూబొదుగూ లేదు. ఇంట్రాడేలో డాలర్‌తో రూ.69.39గా ట్రైడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.74 శాతం తగ్గి బ్యారెల్ 70.71 డాలర్లు పలికింది.