బిజినెస్

రూపాయి విలువ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: రూపాయి మారకం విలువ బుధవారం భారీ తగ్గింది. డాలర్‌కు 28 పైసలు పతనమైంది. దీంతో డాలర్ విలువ 69.71 రూపాయలకు పడిపోయింది. అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నదన్న వార్తల నేపథ్యంలో ఫోరెక్స్ మార్కెట్ పతనం వైపు అడుగులు వేసింది. రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ, డాలర్ ధర ఒకానొక దశలో 69.57 రూపాయలకు చేరుకుంది. అయితే, చివరిలో కొంతమేరకు కోలుకోవడంతో 69.71 రూపాయలుగా స్థిరపడింది. అమెరికా-చైనా దేశాల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. చైనాపై ప్రత్యక్ష చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అంటున్నారు. దీని ప్రభావం ప్రపంచ దేశాల ఫోరెక్స్, బులియన్, స్టాక్‌మార్కెట్‌లపై పడింది. భారతదేశంలో కూడా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.