బిజినెస్

స్థిరంగా టెలికాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: టెలికాం రంగం అభివృద్ధి దేశంలో స్థిరంగా కొనసాగుతోంది. విస్తారమైన మార్కెట్ దేశంలో ఉన్నప్పటికీ పోటీ కూడా అంతే తీవ్రంగా ఉంది. దీంతో వివిధ మొబైల్ కంపెనీలు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. సరికొత్త ప్రణాళికలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థుల కంటే మెరుగైన సేవలను అందించడం ద్వారా ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ టెలికాం పరిశ్రమ భారతదేశంలో ఆశాజనకంగా ఉందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏవై) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఈ-కామర్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్ వంటి సేవలను అందించడానికి కూడా టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీల మొత్తం ఆదాయం తగ్గినట్టు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. అన్ని కంపెనీలు మెరుగైన ఫలాలను సాధించాయి. ఇలావుంటే, భారతీ ఎయిర్‌టెల్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎవరూ ఊహించని విధంగా 29 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో నికర లాభం 107.20 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆ కంపెనీ 82.09 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. మొత్తమీద టెలికాం కంపెనీలు గత ఏడాది చివరి త్రైమాసికంలో సగటున 6.2 శాతం లాభాలను సంపాదించాయి. ఈ మొత్తం 20,602.20 కోట్ల రూపాయలు. మొత్తమీద టెలికాం రంగం మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.