బిజినెస్

బ్యాంకింగ్ రంగంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, ఆగస్టు 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక సంస్కరణలను నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన వివిధ కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతున్నారు. ‘దేశంలో బ్యాంకింగ్ పరిశ్రమపై దాడులు పెరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ సర్కారు ప్రభుత్వ రంగంలోని బ్యాంకులతో పాటు వాటి అనుబంధ బ్యాంకులను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు మొండి రుణాల పేరుతో ప్రజా ధానాన్ని కూడా లూటీ చేస్తున్నారు. వీటన్నింటినీ నిరసిస్తూ మేము కూడా వచ్చే నెల 2వ తేదీన వివిధ కార్మిక సంఘాలు నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం’ అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం గురువారం వడోదరలో స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, ఏకపక్షంగా తీసుకొస్తున్న కార్మిక సంస్కరణలను నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహించాలని ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్, సిఐటియు, ఎఐయుటియుసి, టియుసియు, ఎస్‌ఇడబ్ల్యుఎ, ఎఐసిసిటియు, యుటియుసి, ఎల్‌పిఎఫ్ తదితర కేంద్ర కార్మిక సంఘాలన్నీ మార్చి 30వ తేదీన పిలుపునిచ్చాయి. అయితే ఈ సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) నిర్ణయించుకుంది. కార్మిక చట్టాలను సవరించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదననలను వ్యతిరేకిస్తూ పైన పేర్కొన్న కార్మిక సంఘాలు గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన కూడా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

చిత్రం.. ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం