బిజినెస్

దేశీయంగానూ బిజినెస్ క్లాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 9: దేశంలోని ప్రధాన ప్రాంతాల రూట్లలో ఈనెల 11 నుంచి బిజినెస్ క్లాస్ టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు ప్రైవేటు విమాన యాన సంస్థ స్పైస్ జెట్ గురువారం నాడిక్కడ తెలిపింది. దేశీయంగా సరసమైన టికెట్ ధరలను అందజేస్తున్న ఈ సంస్థ సరికొత్త ఆఫర్‌ను బోయింగ్ 737 నిర్వహణల ద్వారా ఆరంభించనున్నట్టు తెలిపింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వారణాసి, బగ్‌దోగ్రా, శ్రీనగర్ ప్రాంతాలకు ఈ బోయింగ్ విమానాలను నడుపనున్నట్టు స్పైస్ జెట్ పేర్కొంది. ప్రస్తుతానికి మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన కొన్ని బోయింగ్ 737 విమానాలను లీజు పద్ధతిలో తీసుకున్న నేపథ్యంలో స్పైస్‌జెట్ ఈ తాజా ప్రకటన చేసింది.