బిజినెస్

మెరిసిన పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: వరుసగా రెండోరోజు విఫణి వీధిలో బంగారం ధరలు మెరిశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాములు (తులం) బంగారం ధర గురువారం రూ. 40 పెరిగి మొత్తం ధర రూ. 32,890కి చేరింది. స్థానిక జువలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతోబాటు అంతర్జాతీయంగా సైతం సానుకూల పరిస్థితులు నెలకొనడం బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేసినట్టు అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. కాగా వెండి ధరల్లో గురువారం సైతం స్థిరత్వం కొనసాగింది. కిలో వెండి ధర రూ. 38,220 పలికింది. స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి మార్కెట్‌కు ప్రతికూలతలు నెలకొన్నాయి. ఈనెల 9,10 తేదీల్లో చర్చల నిమిత్తం అమెరికా వెళ్లిన చైనాప్రతినిధుల బృందం అక్కడి వాణిజ్య, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు సాగిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా బంగారం అమ్మకాల్లో సానుకూలతలు నెలకొన్నాయి. ఔన్స్ బంగారం ధర 1,284,70 డాలర్లు పలుకుతోంది. అయితే న్యూయార్క్‌లో వెండి ధరలు మాత్రం స్థిరంగా సాగుతున్నాయి. ఔన్స్ వెండి 14,90 డాలర్లుగా ట్రేడవుతోంది. ఇలావుండగా దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం పది గ్రాములపై రూ. 40 పెరిగి మొత్తం ధర రూ. 32,890గాను, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 32,720గా ట్రేడయ్యాయి. అలాగే 8 గ్రాములతో కూడిన సవరం బంగారం రూ. 26,400 పలికింది. వెండి కిలో రూ. 38,220, వార ప్రాతిపదికన సరఫరా చేసే వెండి కిలోపై రూ.339 పెరిగి రూ.37,445 వంతున అమ్ముడయ్యాయి. ఇక వెండి నాణేల ధరలు స్థిరంగా వంద పీసులకు కొనుగోళ్లలో రూ. 79 వేలు, విక్రయాల్లో రూ. 80 వేల వంతున ట్రైడయ్యాయి.