బిజినెస్

రూ. 100 కోట్లు సమీకరించిన ‘కినరా కేపిటల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘కినరా కేపిటల్’ గురువారం ప్రైవే టు ఈక్విటీల ద్వారా రూ. 100 కోట్లు సమీకరించింది. గజాకేపిటల్, మైఖేల్ అండ్ సుసాన్ డెల్ ఫౌండేషన్, పటామర్ కేపిటల్, గవా కేపిటల్ సం స్థలకు వాటాలను విక్రయించడం ద్వారా ఈ నిధు ల సమీకరణ జరిగింది. కాగా తొలిరౌండ్‌లో సేకరించిన ఈ నిధులను కంపెనీ అభివృద్ధికి వినియోగిస్తామని, ముఖ్యంగా సాంకేతిక రంగంలో పెట్టుబడులను పెంచడం ద్వారా ప్రస్తుత మార్కెట్‌తోబాటు సరికొత్త మార్కెట్లలోకి సైతం వాణిజ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నట్టు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా సరికొత్త మైలురాళ్లను అందుకునేందుకు ముందుకెళుతున్నామని కంపెనీ సీఈవో హార్థికా షా తెలిపారు. చిన్నతరహా వ్యాపారులకు రుణాలివ్వడం ద్వారాప్రజలకు మరిన్ని సరళీకృత, వేగవంతమైన సదుపాయాలు కల్పించనున్నామని, రుణాలను రూ. 2 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఎలాంటి ఆ స్తుల పూచీకత్తు లేకుండా అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా ఎంఎస్‌ఎమ్‌ఈలపై దృష్టి నిలి పి తయారీ రంగంలో ఇప్పటి వరకు రూ. 1,160 కోట్ల రుణాలను పంపిణీ చేశామన్నారు. అలాగే చిన్న తరహా వ్యాపారులకు ఇప్పటికీ 33,785 మం దికి రుణాలను అందజేశామని షా చెప్పారు.