బిజినెస్

ఎస్‌బీఐ నికర లాభం రూ. 838 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: దేశీయ బ్యాంకుల్లో అగ్రగణ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం 2018-19 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో రూ. 838.40 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు ఆ బ్యాంకు వెల్లడించింది. నిరర్థక ఆస్తుల శాతం గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ.7,718.17 కోట్ల నష్టాలను చవిచూసింది. ఐతే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు నెలల్లో ఆదాయం సుమారు 11 శాతం వృద్ధిచెంది మొత్తం ఆదాయం రూ. 75,670.50 కోట్లకు చేరింది. అంతకు క్రితం సంవత్సరం ఇదే కాలానికి రూ. 68,436.06 కోట్ల ఆదాయం ఈ బ్యాంకుకు వచ్చిందని ఈ బ్యాంకు తన రెగులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. కాగా మొత్తం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,069.07 కోట్ల స్థూల లాభాలను గడించినట్టు ఎస్‌బీఐ తెలిపింది. 2017-18 మొత్తం సంవత్సరంలో రూ. 4,187.41 కోట్ల నష్టాలను ఈ బ్యాంకు చూపింది. ఆ ఆర్థిక సంవత్సరం ఇదే కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 3.30 లక్షల కోట్ల రూపాయల స్థూల ఆదాయం పెరిగిందని తెలిపింది. కాగా నిరర్థక ఆస్తులు తగ్గించుకోవడంలో గణనీయమైన ప్రగతిని ఈ బ్యాంకు సాధించింది. గత మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సంరంలో మొత్తం నిరర్థక ఆస్తులను, మొండి బకాయిలను 7.53 శాతానికి తగ్గించుకోవడం జరిగిందని ఆ బ్యాంకు తెలిపింది. 2018 మార్చి నాటికి ఈ మొత్తం 10.91 శాతంగా ఉండేది. మొండి బకాయిలు 5.73 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గాయి. ఇలావుండగా స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకు వాటాలు శుక్రవారం 0.74 శాతం నష్టపోయి బీఎస్‌ఈలో ఒక్కోవాటా రూ. 297.05గా ట్రేడైంది.