బిజినెస్

డబ్ల్యుటీవో అప్పిలేట్ బాడీకి పూర్తిస్థాయి సభ్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) పునర్విచారణ విభాగం (అప్పిలేట్ బాడీ)కి చెందిన వివాద పరిష్కార విధానం (డిస్య్పూట్ సెటిల్‌మెంట్ సిస్టం) నిర్వీర్యమైతే సంస్కరణల సమతుల్యానికి విఘాతం ఏర్పడుతుందని భారత్ సోమవారం వ్యాఖ్యానించింది. ఇందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్థికి ఆటంకం కలుగుతుందని పేర్కొంది. డబ్ల్యుటీవోకు చెందిన 22 మంది సీనియర్ అధికార ప్రతినిధులు హాజరైన రెండు రోజుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ డబ్ల్యుటీవో సంస్కరణలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సమావేశ ప్రారంభ సెషెన్స్‌లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అనూప్ వధవాన్ మాట్లాడుతూ వాణిజ్యానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న బహుళ సంబంధాల నిబంధనల విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. అంతర్జాతీయంగా ఏకీకృత విధానాలకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు ప్రత్యామ్నాయ చర్యలు చేడుతుండటం సమస్యగా మారిందన్నారు. ఓ వైపు కీలకాంశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యుటీవో అప్పిలేట్ బాడీకి సభ్యుల నియామకంలోప్రతిష్టంభన నెలకొనడం పెనుసవాళ్లను ముందుకు తెస్తోందన్నారు. ఇలా అప్పిలేట్ బాడీ నియామకంలో జాప్యం చేయడం వల్ల డబ్ల్యుటీవో నిర్వహణకు, వివాదాల పరిష్కార వ్యవస్థ ఉనికికే ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంతమాత్రం మంచిదికాదని, ప్రత్యేకించి తాజాగా అభివృద్ధి చెందుతున్న జాబితాలోకి చేరిన దేశాలకు నష్టదాయకమని అన్నారు. వెంటనే నిర్మాణాత్మక చర్యలు చేపట్టి డబ్ల్యుటీవో అప్పిలేట్ బాడీని మరింత పటిష్టవంతమైన వివాద పరిష్కార వేదికగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాగా అమెరికా ఈ సభ్యుల నియామకాన్ని అడ్డుకుందని, ఈ విభా గం పనిచేయాలంటే కనీసం ముగ్గురు సభ్యుల కోరం ఉండాలని, డిసెంబర్ 10న ఈ అప్పిలేట్ బాడీ కాలపరిమితి ముగిసిపొతుందని, ఆ తర్వా త ఇది నిర్వీర్యం అవుతుందని అనూప్ వధవాన్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డబ్ల్యుటీవోను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఎర్పడిందన్నారు. ఐతే ఇందులో కూడా సమతుల్యం దెబ్బతింటోందని, సంస్కరణలకు సంబంధించిన అజెండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందడం లేదని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం రంగం ప్రస్తుతం డబ్ల్యుటీవోలోప్రాధాన్యనివ్వాల్సిన కీలకాంశంగా మారిందన్నారు. ఈ విషయంలో తాజా అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర ఖనిజాల వెలికితీతను విస్తరించే చర్యల్లో భాగంగా మత్స్యకారుల దైనందిన జీవితాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.