బిజినెస్

నష్టాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 18: వరసగా రెండు రోజులు నష్టాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తెరదించిన కొద్ది క్షణాలకే రిటైల్, సంస్థాగత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రధాన సూచీలు తిరిగి లాభాల్లో పరుగులు పెట్టాయి. వడ్డీ రేట్లు పెంచడానికి విధానకర్తలు తొందరపడ్డం లేదని బుధవారం సమావేశమైన అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే భారతీ ఎయిర్‌టెల్ షేరు 2 శాతం పెరిగిపోయింది. దాంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 2,858 కోట్ల రూపాయలు పెరిగింది. అలాగే పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు 52 వారాల గరిష్ఠస్థాయికి చేరుకుని 4 శాతం వృద్ధితో ముగిసింది. దీంతో ఆ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 3,871 కోట్లు పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో పాటుగా భారత్ వృద్ధి రేటు అంచనాను మూడీస్ 7.5 శాతంగానే కొనసాగించడం కొనుగోలుదారులకు మంచి ఊపునిచ్చిందని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు.
గురువారం ఉదయం నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ ఒక దశలో 28,214.17 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది కూడా. అతే లాభాల స్వీకరణ కారణంగా ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 118.07 పాయింట్ల లాభంతో 28,123.44 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 49.20 పాయింట్లు లాభపడి 8,673.25 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 20 షేర్లు లాభాలతో ముగియగా, 10 షేర్లు నష్టపోయాయి. లాభాలు ఆర్జించిన వాటిలో ఎన్‌టిపిసి, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఒఎన్‌జిసి, డాక్టర్ రెడ్డీస్. ఎస్‌బిఐ ఉన్నాయి. నష్టపోయిన వాటిలో కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టి, గెయిల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, విప్రో ప్రధానంగా ఉన్నాయి.