బిజినెస్

కోలుకోని స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 13: వరుసగా ఎనిమిది సెషన్స్ నష్టాలను ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్ ఈవారం మొదటి రోజున కూడా అదే దారిలో నడిచింది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా మారడంతో, ఏ మాత్రం కోలుకోలేకపోయింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 372.17 పాయింట్లు పతనమై, 37,090 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 130.70 పాయింట్లు నష్టపోయి, 11,148.20 పాయింట్లకు పడిపోయింది. అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడకపోగా, మరింత తీవ్ర రూపం దాల్చడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర, రూపాయి మారకపు విలువ బలపడకపోవడం వంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇటు బీఎస్‌ఈలో, అటు ఎన్‌ఎస్‌ఈలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న వాటాలను అమ్మడానికి ప్రయత్నించడంతో, మార్కెట్ ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో సన్ ఫార్మా కంపెనీ షేర్లు అన్నిటికంటే అధికంగా, 9.39 శాతం నష్టపోయాయి. ఎస్ బ్యాంక్ షేర్ల ధర 5.58 శాతం పతనమైంది. టాటా స్టీల్ (3.22 శాతం), ఇండస్‌ఇండ్ (3.20 శాతం), టాటా స్టీల్ (3.09 శాతం) కంపెనీల షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. కాగా, ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితులను తట్టుకొని, హెచ్‌డీఎఫ్‌సీ 1.06 శాతం లాభాలను ఆర్జించింది. హెచ్‌యూఎల్ (0.87 శాతం), ఇన్ఫోసిస్ (0.56 శాతం), బజాజ్ ఫిన్ (0.24 శాతం), కోల్ ఇండియా (0.23 శాతం) కంపెనీల షేర్లు కూడా లాభాలను ఆర్జించాయి. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో ఇచర్ కంపెనీ షేర్లు 8.13 శాతం పతనమయ్యాయి. జీ ఎంటర్‌టైనె్మంట్ (6.64 శాతం), సన్ ఫార్మా (5.43 శాతం), ఇండియాబుల్స్ (5.42 శాతం), ఎస్ బ్యాంక్ (4.96 శాతం) కంపెనీల షేర్ల ధర కూడా ఎన్‌ఎస్‌ఈలో పతనమైంది. అయితే, టైటాన్ కంపెనీ వాటాలు 1.49 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ 1.31 శాతం, భారతి ఇన్‌ఫ్రా 1.24 శాతం, టెక్ మహీంద్ర 0.82 శాతం, హెచ్‌యూఎల్ 0.69 శాతం లాభాలను ఆర్జించాయి. ఇలావుంటే, గతంలో ఎన్నడూ వరుసగా ఇన్ని రోజుల నష్టాలను భారత స్టాక్ మార్కెట్ ఎదుర్కోలేదు. అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం ఈ భారీ నష్టాలకు ప్రధాన కారణం. అంతేగాక, దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, అందరి దృష్టి ఈనెల 23న వెలువడే ఫలితాలపై కేంద్రీకృతమైంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ కోలుకోవడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వరుసగా తొమ్మిది రోజుల లావాదేవీలు నష్టాల్లో ముగియడంతో, మదుపరుల్లో ఆందోళ పెరుగుతున్నది.
అదే సమయంలో, స్టాక్ బ్రోకర్లపై అమ్మకాల ఒత్తిళ్లు తప్పడం లేదు. మంగళవారం నాటి ట్రేడింగ్‌లోనైనా నష్టాలకు తెరపడి, మార్కెట్ కోలుకునే అవకాశం లేకపోలేదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి అంచనాలు, ఆలోచనలు ఎలావున్నా స్టాక్ మార్కెట్ సత్వరమే కోలుకోకపోతే, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉంటుందనేది వాస్తవం.