బిజినెస్

మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / రామగిరి: తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గడచిన ఐదేళ్ల కాలంలో అత్యద్భుత ప్రగతిని సాధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా నిలిచింది. ముఖ్యంగా అమ్మకాలు, లాభాలలో తన చరిత్రలోనే ఆల్‌టైం రికార్డుగా అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోని 8 మహారత్న కంపెనీలు సాధించిన దాని కన్నా ఎంతో ఎక్కువ సాధించి తన సత్తాను చాటుకొంది. సింగరేణి సంస్థ అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని కనపరిచింది. 2013-14లో రూ.11928 కోట్ల అమ్మకాలు జరుగగా 2018-19 నాటికి ఇవి రెండు రెట్లను దాటి రూ.25828 కోట్ల రూపాయల ఆల్‌టైం రికార్డుకు చేరుకొన్నాయి. అంటే 116.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అలాగే 2013-14లో రూ.419 కోట్ల నికర లాభాలు గడించగా, 2018-19 నాటికి ఇవి నాలుగు రెట్లు పెరిగి రూ.1600 కోట్ల రూపాయలను చేరుకొన్నాయి. అంటే లాభాల్లో 282 శాతం వృద్ధిని కంపెనీ సాధించింది. దేశంలో గల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మేటిగా 8 భారీ సంస్థలను మహారత్న కంపెనీలుగా కేంద్రం గుర్తించింది. వీటిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోలిండియా లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎన్.టి.పి.సి, గెయిల్ లిమిటెడ్, స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బి.హెచ్. ఇ.ఎల్ ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ మహారత్న కంపెనీలు లాభాలు, అమ్మకాలలో సాధించిన వృద్ధి రేటుతో పోలిస్తే సింగరేణి సంస్థ ఈ కంపెనీలకు అందనంత ఎత్తున నిలబడి ఉంది.
లాభాలలో వృద్ధిని పరిశీలిస్తే మహారత్న కంపెనీలను మించి సింగరేణి సంస్థ 281.9 శాతం వృద్ధిని నమోదు చేసి లాభాల్లో అత్యున్నత శిఖరంపై నిలిచింది. అమ్మకాలలో మహారత్న కంపెనీలతో పోలిస్తే సింగరేణి సాధించిన వృద్ది ఎంతో ఎక్కువ. అమ్మకాలలో కోలిండియాలో 55.1 శాతం వృద్ధి, ఓఎన్‌జీసీ 30.9 శాతం, గెయిల్ లిమిటెడ్ 28.6 శాతం, ఎన్.టి.పి.సి 26.5 శాతం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 24.4 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 23.8 శాతం, బి.హెచ్.ఇ.ఎల్ 2 శాతం వృద్ధిని నమోదు చేయగా సింగరేణి సంస్థ 116.5 శాతంనమోదు చేసి ఉన్నత స్థాయిలో నిల్చింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి సాధించిందని సంస్థ సిఅండ్ ఎండీ నడిమెట్ల శ్రీధర్ తెలిపారు. సింగరేణి సంస్థ లాభాల్లో 282 శాతం, అమ్మకాలలో 116.5 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా నిలవడం సంతోషకరమని, ఈ ఏడాదికి నిర్దేశించిన 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాలను సాధించడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి అమలు పరుస్తున్నామని తెలిపారు. ప్రగతికి సహకరిస్తున్న సింగరేణీయులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

చిత్రం...ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందచేస్తున్న సీఎండీ శ్రీధర్