బిజినెస్

బహుళ ప్రయోజనకర వాణిజ్య బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బహుళార్థ సంబంధ వాణిజ్య విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు 23 డబ్ల్యుటీవో సభ్య దేశాల రెండు రోజుల సమావేశం దోహదం చేస్తుందని భారత్ వ్యాఖ్యానించింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమావేశం మంగళవారంతో ఇక్కడ ముగిసింది. కాగా డబ్ల్యుటీవోలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల సూచనలు సైతం తోడ్పడతాయన్న ఆశాభావాన్ని భారత్ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.
రెండో రోజు సమావేశంలో అభివృద్థి చెందుతున్న దేశాల సమస్యలపై, ప్రత్యేకించి డబ్ల్యుటీవోలో ఉన్న ప్రత్యేక, ప్రాధాన్యతలు, గౌరవాలను ఇచ్చే విధానాల (ఎస్ అండ్ డీటీ)పై ఓ డిక్లరేషన్‌తో ముందుకు రావడం జరగిందని భారత్ మంగళవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది. ఎస్ అండ్ డీటీ విధానంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు డబ్ల్యుటీవోలో మరింత వెసులుబాటు కలుగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా కొన్ని ఒప్పందాలు, కట్టుబాట్లు ఏర్పడి వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు దేశీయంగా సమకూరుతాయని పేర్కొంది. కాగా డబ్ల్యుటీవో నిబంధనలపై అమెరికా వాదనల ప్రకారం ఎస్ అండ్ డీటీలో సంపన్న దేశాలకు, ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తున్న దేశాలకు భాగస్వామ్యం ఉండరాదు. ఐతే న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన మినిస్టీరియల్ సమావేశం ప్రధానంగా వాణిజ్య బహుళ బంధాలను పునరుత్తేజం, బలోపేతం చేయడంపై, డబ్ల్యుటీవో వివాద పరిష్కార విభాగం కార్యవర్గం శీఘ్రగతిన నిర్ణయాలు తీసుకోగలిగేలా తీర్చిదిద్దాలనే విషయంపై దృష్టి కేంద్రీకరించిందని భారత్ తెలియజేసింది. అన్ని సభ్య దేశాలతోబాటు అభివృద్ధి చెందుతున్న దేశాల అభిప్రాయాలను సేకరించి తదనుగుణంగా డబ్ల్యుటీవో సంస్కరణలకు సూచనలివ్వాలన్నదే ఈ రెండు రోజుల సమావేశ లక్ష్యమని తెలిపింది. కాగా చివరి రోజైన మంగళవారం సమావేశానికి హాజరైన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ డబ్ల్యుటీవోలో సంస్కరణలకు, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు పునరంకితమయ్యేలా ఈ రెండు రోజుల సమావేశాల్లో సూచనలు, సలహాలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానంగా వివక్షత లేకుండా, పారదర్శకంగా, నిర్థిష్టమైన నిర్ణయాత్మక శక్తిగా డబ్ల్యుటీవో రూపాంతరం చెందాల్సివుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 7.3 బిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారని ఇప్పటి వరకు డబ్ల్యుటీవో కారణంగా ఈ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలూ సమకూరలేదని పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు కావలసింది ఆర్థిక సాయం కాదు వాణిజ్య సహకారం’ అని ఆయన అన్నారు. ఇకపై డబ్ల్యుటీవో పనితీరు ఆ దిశలో సాగుతుందన్న నమ్మకాన్ని సురేష్‌ప్రభు వ్యక్తం చేశారు.
ఇలావుండగా సోమవారం రాత్రి పొద్దుపోయాక సమావేశంలో డబ్ల్యుటీవో డైరెక్టర్ జనరల్ రాబర్టో అజవెడో ప్రసంగిస్తూ వివాద పరిష్కార వ్యవస్థే వివాదంలో పడటం అతిపెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అన్ని సభ్య దేశాలు దీనిపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందన్నారు. డబ్ల్యుటీవో వివాద పరిష్కార అప్పిలేట్ బాడీ సభ్యుల నియామకాన్ని అమెరికా నిలిపివేయడంతో డబ్ల్యుటీవో పనితీరుకే విఘాతం కలిగిందని, ఇందువల్ల దేశాల మధ్య బహుల ప్రయోజన వాణిజ్య బంధాలు సైతం దెబ్బతింటున్నాయన్న విమర్శలను ఆయన ప్రస్తావించారు.
కొన్ని డబ్ల్యుటీవో సభ్య దేశాల మధ్య వివాదం తలెత్తినంత మాత్రాన మొత్తం సభ్య దేశాల మధ్య చీలికగా భావించరాదని ఆయన అన్నారు. అలాగే ఎస్ అండ్ డీటీ విషయంలోప్రత్యేక తరహా, వైవిధ్యభరిత విధానాన్ని ఈ విషయంలో అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నిర్ణయమైనా చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనకారిగా ఉండాలని రాబర్టో అజవెడో సూచించారు. ‘వాణిజ్యం, వసతుల కల్పన, ఒప్పదం’ అనే అంశాల ప్రాతిపదికగా ప్రతిదేశం తమ బెంచ్ మార్కును ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు.
చిత్రం...కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు