బిజినెస్

రూ. 1,400 కోట్లు సమీకరించిన ‘గ్రాఫర్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఆన్‌లైన్‌లో కిరాణా వస్తువుల రీటెయిల్ వ్యాపారం సాగించే ‘గ్రాఫర్స్’ దాదాపు రూ. 1400 కోట్లు (200 మిలియన్ డాలర్లు) సమీకరించినట్టు బుధవారం ఇక్కడ ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంకు విజన్ ఫండ్ నేతృత్వంలో ఈ నిధుల సమీకరణ చేసినట్టు ఆ కంపెనీ తెలిపింది. ‘సిరీస్ ఎఫ్ ఫండింగ్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త పెట్టుబడిదారు ‘కేటీబీ’తోబాటు సంస్థకు చెందిన ప్రస్తుత వాటాదార్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, సెక్వోయియా కేపిటల్ సంస్థలు పాల్గొన్నాయని తెలిపింది. మనదేశంలో ఆన్‌లైన్ కిరాణా రీటెయిల్ వాణిజ్య రంగంలో ఇదే అతిపెద్ద ప్రాథమిక ఫైనాన్సింగ్ రౌండ్‌గా మారిందని ఆ కంపెనీ తెలిపింది. ఈ అదనపునిధులతో సంస్థను కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తామని, మిలియన్ల మంది భారతీయ వినియోగదారులకు తమ కంపెనీ సేవలను మరింత చేరువ చేస్తామని గ్రాఫర్స్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాఫర్స్ కంపెనీ మొత్తం విలువ 600 మిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా బిగ్‌బాస్కెట్‌తో పాటు కిరాణా వస్తువులను ఆన్‌లైన్ విక్రయాలకు గ్రాఫర్స్ నిర్వహిస్తోంది. ప్రైవేటు లేబుల్ ప్రాడక్ట్ ఆఫరింగ్స్‌తోబాటు, గృహవినియోగ వౌలిక సదుపాయాలను మరింతగా విస్తరించడం ద్వారా ఈ కంపెనీ తన సరఫరా చైన్‌ను పటిష్టవంతం చేసుకునేందుకు చర్యలు కొనసాగిస్తోంది.