బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: విఫణివీధిలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ.160 తగ్గి మొత్తం ధర రూ.33,170కు పలికింది. ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోబాటు అంతర్జాతీయంగానూ బలహీనమైన పరిస్థితులు నెలకొనడం ఇందుకు కారణమని అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. కాగా వెండి ధరలు సైతం అదేబాటలో నడిచాయి. కిలో వెండిపై రూ. 625 తగ్గి మొత్తం ధర 37,625కు దిగివచ్చింది.
పరిశ్రమల నుంచి తగ్గిన డిమాండ్‌తోబాటు నాణేల మార్కెట్లో సైతం ప్రతికూలతలు తలెత్తడం ఇందుకు కారణంగా వ్యాపార సంఘ నేతలు అంచనా వేస్తున్నారు. కాగా అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ట్రేడింగ్‌లో సైతం ధర తగ్గి ఔన్స్ బంగారం 1,286.50 డాలర్లు పలికింది. అలాగే న్యూయార్క్‌లో ఔన్స్ వెండి 14.58 డాలర్లుగా ట్రే డైంది. కాగా ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం రూ. 33,170గాను, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 33,000 గానూ అమ్మకాలు జరిగాయి. అలాగే ఎనిమిది గ్రాములతో కూడిన సవరం బంగారం ధర స్థిరంగా రూ.26,500 పలికింది. కాగా వార పద్ధతిలో సరఫరా జరిగే వెండి ధరలు సైతం కిలోపై రూ.702 తగ్గిపోయి రూ. 36,822కు దిగివచ్చింది. మరోవైపువెండి నాణేలు 100 పీసులు విక్రయాల్లో రూ. 81వేలు, కొనుగోళ్లలో రూ.80 వేల వంతున ప్లాట్‌గా ట్రేడయ్యాయి.