బిజినెస్

త్రైమాసిక లాభాల్లో 113.3 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 17: సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ శుక్రవారం ఇక్కడ నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. 2019 మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి వంద శాతం అధికంగా సుమారు రూ. 32 కోట్ల అదనపు లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. ఎలాంటి భాగస్వామ్యాలూ లేని ఈ కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.15 కోట్ల లాభాలను ఆర్జించింది. మొత్తం ఆర్థిక సంవత్సర లాభాలు స్థూలంగా 57.4 శాతం వృద్ధితో రూ. 85 కోట్లు వచ్చాయని వివరించింది. అంతకు క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ. 54 కోట్లు వచ్చిందని వివరించింది. ఆలాగే గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.42 కోట్ల ఆదాయం సమకూరిందని, గతంలో ఇదే కాలంలో రూ.23 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపింది. అలాగే గత ఏడాది మొత్తానికి ఆదాయం రూ. 76 కోట్ల నుంచి 121 రూ. కోట్లకు చేరిందని వివరించింది. ఒక్కో వాటాకు ఐదు రూపాయల వౌఖిక విలువ ప్రకారం రూ.1.76 వంతున డివిడెండ్‌ను ఇటీవల జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో వాటాదారులకు సిఫారసు చేయడం జరిగిందని జరిగిందని తెలిపింది.