బిజినెస్

అతిపెద్ద మూడో దేశంగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వచ్చే ఎనిమిదేళ్లలో తమ సంస్థ దేశం వెలుపల అంతర్జాతీయంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే మూడు ప్రధాన దేశాల్లో భారత్‌కూడా ఒకటని జపాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఎల్‌ఐఎక్స్‌ఐఎల్’ ఆదివారం నాడిక్కడ ప్రకటించింది. ప్రధానంగా వాటర్ టెక్నాలజీ వాణిజ్యాన్ని విస్తరించాలని తమ సంస్థ నిర్ణయించిందని, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్నాన గదుల వంటి ప్రత్యేక నిర్మాణాలు చేపడతామని సంబంధింత అధికారి ఒకరు తెలిపారు. నీటి నిర్వహణ, గృహ వినియోగ వస్తువుల తయారీలో పేరెన్నికగన్న ఈ సంస్థ 2011లో జపాన్‌కు చెందిన ఐదు ప్రముఖ భవన నిర్మాణ పరికరాల తయారీ, గృహ నిర్మాణ కంపెనీలను విలీనం చేసుకోవడం ద్వారా అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించింది. తాజాగా ప్రైమరీ వాటర్ టెక్నాలజీ వాణిజ్యంలోకి అడుగిడుతూ భారత్‌లో 16 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేయనుంది. ప్రస్తుతం అమెరికన్ సాంకేతిక విలువలతో కూడిన బ్రాండెడ్ వస్తువులను ‘గ్రోహ’ పేరిట ‘ఎల్‌ఐఎక్స్‌ఐఎల్’ భారత్‌లో విక్రయాలు సాగిస్తోంది. ‘ప్రస్తుతం తమ అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ అతిపెద్ద భాగస్వామి కాకున్నా వాటర్ టెక్నాలజీ వాణిజ్యంలో తమకు చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ కావచ్చని అంచనా వేస్తున్నట్టు ఎల్‌ఐఎక్స్‌ఐఎల్ ఆసియా పసిఫిక్ సీఈవో బిజయ్ మోహన్ తెలిపారు. వచ్చే ఏడు నుంచి ఎనిమిదేళ్ల కాలంలో ఇది సాధ్యం కానుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే తమ వాణిజ్యంలో భారత్ 15 వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బాత్రూంల విభాగం ఏకైక అతిపెద్ద వాణిజ్యంగా తమ సంస్థకు చెందిన విలువ, ఆదాయాల్లో ప్రాముఖ్యతను సంతరించుకుందని మోహన్ చెప్పారు.