బిజినెస్

కౌంటింగ్ రోజు మద్యం అమ్మకాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ఈనెల 23వ తేదీన లోక్‌సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా జంటనరాల్లో మద్యం అమ్మకాలు ఉండవు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. 23న ఎక్కకడైనా పార్టీల కేడర్ గుంపులుగా చేరి హంగామా చేయడానికి ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకుంటామన్నారు. 23న ఉదయం నుంచి 24 ఉదయం 6 గంటల వరకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు మద్దతుగా బాణసంచా కాల్చడం, భారీగా ఊరేగింపులు నిర్వహించడంపై ఆంక్షలు విధించామన్నారు. జంట నగరాల్లో కల్లు, మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యాపారులు పూర్తిగా మూసివేయాలని ఆయన ఆదేశించారు. నగరంలోని మద్యం బార్లతో పాటు ఐదు నక్షత్ర హాటళ్లలో కూడా మద్యం విక్రయాలు బంద్ చేయాలని ఆయన సూచించారు. 23న అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.