బిజినెస్

స్టాక్ మార్కెట్లు డీలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 21: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల రికార్డు స్థాయి పరుగుకు మంగళవారం బ్రేక్ పడింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే పూర్తి విరుద్ధమైన ఫలితాలొచ్చాయి. మదుపర్లు భారీగా లాభాల స్వీకరణకు, వాటాల విక్రయాలకు పాల్పడడంతో రెండు సూచీలూ భారీ నష్టాల పాలయ్యాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 383 పాయింట్లు కోల్పోగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయింది. కేంద్రంలో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న విషయం దాదాపుగా నిశ్చయం అయిపోవడంతో ఇక మదుపర్లు లాభాలపై దృష్టి నిలిపారు. ఈక్రమంలో తొలి కొన్ని గంటలు మినహా రోజులో అధిక సమయం యథేచ్ఛగా వాటాల విక్రయాలు జరిగాయి. దీంతో తొలి గంటల్లో 39,571.73 పాయింట్ల ఆధిక్యతకు వెళ్లిన 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత 382.87 పాయింట్లు కోల్పోయి 0.97 శాతం నష్టాలతో 38,969.80 పాయింట్ల దిగువల స్థిరపడింది. ఒక దశలో ఈ సూచీ 38,884.85 పాయింట్ల కనిష్టానికి వెళ్లి మళ్లీ స్వల్పంగా కోలుకోవడం గమనార్హం. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 119.15 పాయింట్ల కోల్పోయి 1.01 శాతం నష్టాలతో11,709.10 పాయింట్ల దిగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టాటామోటార్స్ అత్యధికంగా 7.05 శాతం నష్టపోయింది. గత మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో లాభాల్లో 49 శాతం తగ్గుదలను సోమవారం ప్రకటించిన ఈ సంస్థకు కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు ఎదురుకావడం విశేషయం. ఇక మారుతి, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, హీరోమోటోకార్ప్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్ బ్యాంక్, టీసీఎస్ సైతం 3.25 శాతం మేర నష్టాలను సంతరించుకున్నాయి. మరోవైపుఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్ 1.08 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం 0.84 శాతం నష్టాలను చవిచూశాయి. ఇలావుండగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకారం కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టాక్ మార్కెట్ల లాభాలు కొనసాగుతాయని మదుపర్లు భావిస్తున్నారని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అందుకే తాత్కాలికంగా లాభాల స్వీకరణకు పాల్పడ్డారని అంటున్నారు. సోమవారం 30 షేర్ల సూచీ సెనె్సక్స్ రాకెట్ స్పీడుతో దూసుకెళ్లి ఏకంగా 1,421.90 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ సైతం అదే స్థాయి దూకుడును ప్రదర్శించి 421.10 పాయింట్ల రికార్డు స్థాయి ఆధిక్యతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి మంగళవారం పూర్తి విరుద్ధంగా మారిపోవడం విశేషం.
తగ్గిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ మంగళవారం స్వల్పంగా తగ్గి 69.76 రూపాయలుగా ట్రేడైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌పై 0.04 శాతం పెరిగి 72.01 డాలర్ల వంతున పలికింది. అలాగే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఆరంభ వాణిజ్యంలో మిశ్రమ ఫలితాలతో సాగాయి. ఐతే ఐరోపా మార్కెట్ సూచీలు మాత్రం లాభాల బాట పట్టాయి.