బిజినెస్

ఎయిర్ ఇండియా కొత్త విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: వచ్చే నెల నుంచి దేశ విదేశీ మార్గాల్లో పలు కొత్త విమానాలను నడుపనున్నట్టు ఎయిర్ ఇండియా బుధవారం నాడిక్కడ తెలిపింది. వేసవి సెలవుల్లో సీట్లకు విశేషంగా పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది. జూన్ 1 నుంచి ముంబయి-దుబాయ్-ముంబయి మార్గంలో వారానికి 3,500 సీట్లు అధికంగా ఆఫర్ చేయనున్నట్టు వివరించింది. అలాగే జూన్ 2 నుంచి ఢిలీ-దుబాయ్-్ఢల్లీ మార్గంలోనూ 3,500 సీట్లు అధికంగా ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. ఈ మార్గంలో జూన్ 2 నుంచి బీ787 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించడం ద్వారా రెండు కొత్త విమానాలను నడుపుతామని తెలిపింది. అలాగే సేల్ అండ్ ట్రావెల్ విధానంతో జూలై 31 నుంచి ఢీల్లీ, ముంబైల నుంచి దుబాయ్ మధ్య ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ. 7,777 (అన్ని చార్జీలను కలుపుకుని) ప్రమోషనల్ ఫేర్‌గా విక్రయిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది. కాగా దేశీయంగా భోపాల్- పూణే- భోపాల్, వారణాసి-చెన్నై- వారణాసి మార్గాల్లో జూన్ 5 నుంచి కొత్త విమానాలను నడుపుతామని వెల్లడించింది. ఢిల్లీ-్భపాల్-్ఢల్లీ మధ్య ప్రస్తుతం ఉన్న విమానాల సంఖ్యను వారానికి 14 నుంచి 20కి పెంచుతామని, అలాగే ఫ్రీక్వెన్సీని సైతం పెంచుతామని ఆ విమానయాన సంస్థ వివరించింది. ఢిల్లీ-రాయ్‌పూర్- ఢీల్లీ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న వారానికి 7 విమానాల సంఖ్యను 14కు పెంచుతామని పేర్కొంది. అలాగే ఢిల్లీ-బెంగళూరు-ఢిల్లీ-అమృత్‌సర్-్ఢల్లీ, చెన్నై-అహ్మదాబాద్-చెన్నై, చెన్నై-కోల్‌కతా-చెన్నై మార్గాల్లోనూ వారంలోపు నడిచే విమానాల సంఖ్యను పెంచుతామని వివరించింది. ఢిల్లీ-డోదరా- ఢీల్లీ, ముంబయి-వైశాఖ-ముంబయి రూట్లలోనూ విమానాల సంఖ్యను పెంచుతామని ఎయిర్ ఇండియా తెలియజేసింది.