బిజినెస్

స్వల్పంగా పెరిగిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 22: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ట్రేడింగ్ బుధవారం ఆశాజనకంగా సాగలేదు. అయితే దేశీయ మదుపరులు సానుకూలంగా స్పందించడంతో కొద్దిగా కోలుకొని స్వల్ప లాభంతో ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బీఎస్‌ఈలో 140.41 పాయింట్లు మెరుగుపడిన సెనె్సక్స్ 39, 110.21 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడి దారుల నుంచి డిమాండ్ పెరగడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే కొద్ది సేపట్లోనే పతనమై, మధ్యాహ్న సమయానికి స్థిరంగా కొనసాగింది. ఆ తర్వాత సెషన్‌లో దారుణంగా పతనం కావడంతో సెనె్సక్స్‌కు నష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమయింది. అయితే ఆ తర్వాత క్రమంగా కోలుకుంటూ, ఒకానొక దశలో 39,400 పాయింట్లకు చేరువైంది. కానీ కొద్దిసేపట్లోనే భారీగా పతనమైంది. ఆ తర్వాత దేశీయ పెట్టుబడిదారుల అండతో మళ్లీ కోలుకుంది. ఈ లావాదేవీల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల ధరలు అత్యధికంగా, 4.84 శాతం లాభపడ్డాయి. సన్ ఫార్మా (2.92శాతం), బజాజ్ ఆటో (2.29 శాతం), భారతి ఎయిర్‌టెల్ (1.83 శాతం), టాటా మోటార్స్ (1.61 శాతం) కూడా లాభాలనార్జించాయి. కాగా, ఎస్ బ్యాంక్ 2.34, ఐటీసీ 1.88, టీసీఎస్ 1.25, పవర్‌గ్రిడ్ 1.03, హెచ్‌యూఎల్ 0.97 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈలో లాభాల బాటలో నడిచిన ఇండస్‌ఇండ్ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో కూడా లాభాలు ఆర్జించాయి, ఈ కంపెనీ షేర్ల ధర 5.54 శాతం పెరిగాయి. సన్ ఫార్మా 3.46, బజాజ్ ఆటో 2.51, బీపీసీఎల్ 2.35, ఇచర్ మోటార్స్ 1.83 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి.
అయితే టెక్ మహీంద్రా షేర్లు 2.98 శాతం, ఇండియాబుల్స్ షేర్లు 2.94 శాతం చొప్పున పతనమయ్యాయి. భారతి ఇన్‌ఫ్రా 2.52, ఎస్ బ్యాంక్ 1.49, జీ ఎంటర్‌టైన్‌మెంట్ 1.35 శాతం చొప్పున నష్టాలు చవి చూశాయి.