బిజినెస్

భారీ పారిశ్రామికులతో ఎంఎస్‌ఎంఈల సమన్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జూన్ 10: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను మరింత బలోపేతంగానూ, పోటీ తత్వంతోనూ పనిచేసేలా తీర్చి దిద్దాలని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఫెసిలిటేషన్ సెంటర్లు (సదుపాయాల కల్పన కేంద్రాలు) ఏర్పాటు చేయనుంది. పెద్ద పరిశ్రమలు, సంస్థలతో సమన్వయంగా ఎంఎస్‌ఎంఈలు పనిచేసేలా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ అదనపుకార్యదర్శి రామ్ మోహన్ మిశ్రా సోమవారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి సంస్ధ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ‘సామాజిక ఔత్సాహికుల అభివృద్ధి’ అనే అంశంపై వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. కాగా తాలూకా స్థాయిల్లో ఎంఎస్‌ఎంఈ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, తద్వారా ఎంఎస్‌ఎంఈల కష్టనష్టాలు తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుంటుని, అలాగే వారి అభివృద్ధికి ఉపయోగపడే సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌ఎంఈల్లో డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తులను సరఫరా చేయలేని చిన్నచిన వ్యాపారులు, లేదా కుటీర పరిశ్రమలను గుర్తించి వారి సామర్థ్యాన్ని పెంచేందుకు సరఫరా చైన్‌లో వారూ భాగస్వాములయ్యేలా చూసేందుకు, ఉత్పత్తులకు మంచి ధర లభించేలా ఫెసిలిటేషన్ సెంటర్లు తమవంతు కృషి చేస్తాయన్నారు. మార్కెట్లో ఉన్న సేవలపై చాలామందికి అవగాహనా లోపం ఉందని మిశ్రా చెప్పారు. ప్రధానంగా గ్రామీణ స్థాయిలో సేవలను విస్తరించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రధానంగా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, నాణ్యతను పెంచడం ద్వారా ఆ ఉత్పత్తికి మార్కెట్లో డిమాండ్ పెరిగేలా చేయడంపై తమ శాఖ దృష్టి కేంద్రీకరిస్తుందని ఆయన వెల్లడించారు. మానవ సమర్థతను పెంచడం, వైజ్ఞానిక సేవలు అందించడం, ఆర్థిక సహాయానికి తోడ్పటడం, సాంకేతికత, వౌలిక, మార్కెటింగ్ సదుపాయాలు పెంచడం వంటి సేవల ద్వారా ఎంఎస్‌ఎంఈలకు సులభతర వాణి జ్యం అలవడేలా చూడాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.