బిజినెస్

పుంజుకుంటున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 11: వరుసగా మూడోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలకు తోడు బ్యాంకింగ్, లోహ, విద్యుత్ స్టాక్స్‌లో వాటాల కొనుగోళ్లు జోరుగా సాగడం మంళవారం మార్కెట్లకు ఊతమిచ్చింది.
సెనె్సక్స్ 165.94 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 42.90 పాయింట్ల ఆధిక్యతను సాధించింది. రోజంతా దాదాపు 300 పాయింట్ల మధ్య ర్యాలీ కొనసాగించిన బీఎస్‌ఏ సూచీ సెనె్సక్స్ చివరికి 0.42 శాతం లాభాలతో 39,959.46 గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఇంట్రాడేలో ఒక దశలో 40,066.31 పాయింట్ల గరిష్టానికి చేరి మళ్లీ దిగి వచ్చింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 0.36 శాతం లాభాలతో 11,965.60 వద్ద స్ధిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 12,000.35 పాయింట్ల గరిష్టానికి చేరి, మరో దశలో 11,904 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, వేదాంత దాదాపు అత్యధికంగా 2.71 శాతం లాభపడ్డాయి. మరోవైపు సన్‌పార్మా, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్ అత్యధికంగా 3 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. ఇక రంగాల వారీగా తీసుకుంటే లోహ, చమురు సహజ వాయులు, బ్యాంకింగ్ రంగాల సూచీలు 1.33 శాతం లాభాలను అందుకున్నాయి. ఆసియా దేశాల మార్కెట్లలో సానుకూలతలు నెలకొనడం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చిందని మార్కెట్ విశే్లషకులు భావిస్తున్నారు. మెక్సికోకు చెందిన పెట్టుబడిదారులతో చర్చలు జరిపేందుకు అమెరికా సంసిద్ధతను వ్యక్తం చేయడంతో ఈ ప్రభావం తదుపరి చైనా-అమెరికా వివాద పరిష్కారానికీ దోహదం చేయవచ్చని పరిశీలకులు అంచనా వేశారు. దీంతో మదుపర్ల సెంటిమెంటుపై సానుకూలలు మరింత బలపడ్డాయని అంటున్నారు. కాగా ఆసియా మార్కెట్లలో షాంఘయ్ కాంపోజిట్ సూచీ మంగళవారం లాభాల ర్యాలీని కొనసాగించి 2.58 శాతం లాభపడింది. అలాగే హాంగ్‌కాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ సైతం 0.76 శాతం లాభపడగా, నిక్కీ 0.33 శాతం, కోస్పి 0.59 శాతం వంతున లాభాలను సంతరించుకున్నాయి. ఐరోపా మార్కెట్లు మంగళవారం ఆరంభ డీల్స్‌లో లాభాలతోనే ఆరంభమయ్యాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం 21 పైసలు లాభపడి 69.44 రూపాయలుగా ట్రేడైంది. ముడిచమురు ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్ 62.24 డాలర్ల వంతున ట్రేడైంది.