బిజినెస్

గేట్స్ ఫౌండేషన్‌తో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: ఏపిలో అమలు చేస్తున్న ఎన్‌టిఆర్ వైద్య సేవ, డిజిటల్ ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్, వ్యవసాయం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాల్లో తోడ్పాటు అందించేందుకు బిల్ అండ్ మిలింద గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై వారందించనున్న సేవలపై చర్చించారు. గత జూలై 15న తేదీన బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసిన అనంతరం తిరిగి ఈ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామని, వాటిని మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అవసరమైన సాంకేతిక సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఎన్‌టిఆర్ వైద్య సేవ కార్యక్రమం కింద ప్రతి పేదవానికి రెండున్నర లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ఎన్‌టిఆర్ వైద్య చికిత్సల కింద పేలందరికి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామన ఆయన తెలిపారు.