బిజినెస్

లెదర్ పరిశ్రమను ప్రోత్సహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: చెప్పుల పరిశ్రమ ప్రగతికి తోడ్పాటును అందించాల్సిందిగా లెదర్ ఎగుమతిదారులు, చెప్పుల తయారీదార్లు ఆర్థిక మంత్రిత్వ శాఖను ముక్తకంఠంతో కోరుతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందస్తుగా జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను జీఎస్‌టీ రేటు తగ్గించడం ద్వారా లెదర్ ఎగుమతులు, చెప్పుల పరిశ్రమను ప్రోత్సహించాలని లెదర్ ఎగుమతుల కౌన్సిల్ చైర్మన్ పీఆర్ అఖీల్ అహ్మద్ కోరారు. ఫుట్ వేర్ పరిశ్రమ ద్వారా ఎంతోమందికి ఉపాధి లనిస్తోందని, విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందని మంత్రికి అహ్మద్ సూచించారు. జీఎస్‌టీ తగ్గింపు వల్ల ఫుట్‌వేర్ పరిశ్రమ ప్రగతి గణనీయంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం వెయ్యి రూపాయిలు లోపు చెప్పులకు 12 శాతం జీఎస్‌టీని వసూలు చేస్తున్నారనీ, దీనిని ఐదు శాతంగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వెయ్యి రూపాయిలకు పైబడిన వాటికి 18 శాతం వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆరు బిలియన్ డాలర్ల లెదర్, లెదర్ వస్తువుల ఎగుమతులు జరుగుతున్నాయని వివరించారు. వీటిలో ముఖ్యంగా యూరప్, అమెరికాలకు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. లెదర్ ఉత్పత్తుల రంగాన్ని బలోపేతం చేయడానికి గత ప్రభుత్వంలో కామర్స్ మంత్రి 2,600 కోట్ల రూపాయిల ప్యాకేజీని ప్రకటించారని పేర్కొన్నారు. లెదర్ ఉత్పత్తుల రంగంలో దాదాపు 42 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎల్‌ఈ చైర్మన్ వివరించారు.