బిజినెస్

పర్యాటకంతో ఆదాయ మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: యువతకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు పర్యాటక రంగంతోనే సాధ్యమవుతాయని రాష్ట్ర సాంస్కృతిక, యువజన సర్వీస్‌లు, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పర్యాటక, యువజన, పురావస్తు శాఖల పనితీరును ప్రాథమికంగా సమీక్షించినట్లు చెప్పారు. రాష్ట్రంలో సువిశాలమైన సముద్రతీరంతో పాటు అనేక సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నాయని దీంతో ఆదాయ మార్గాలు పెంచ వచ్చన్నారు. ప్రపంచంలో అనేక దేశాల ఆదాయంలో సింహభాగం పర్యాటక రంగం నుంచే వస్తోందన్నారు. మన దేశంలో కేరళ, గోవా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ రంగం ఆదాయ వనరుగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, హిల్, బీచ్ టూరిజం అభివృద్ధికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రంగంలో ఆతిధ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. అతిధి దేవో భవ అనేది దేశ సంస్కృతిలో భాగమన్నారు. మంచి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా పర్యాటక రంగం నుంచి ఎక్కువ ఆదాయం పొందేందుకు వీలు కలుగుతుందని యువతకు ఉపాధి కల్పించేందుకు ఉపకరిస్తుందన్నారు. అరకు, బొర్రా గృహల వద్ద విదేశీ పర్యాటకులకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ఆంగ్ల, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న గైడ్స్‌ను నియమించాలనే యోచనతో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భీమిలి, బొర్రా గృహలు, లంబసింగి, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, భవానీ ఐలాండ్, అహోబిలం మ్యూజియం పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయని వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం ఈ శాఖకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రూ 10- కోట్ల వ్యయంతో కొండపల్లి కోట అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. నిర్మాణంలో ఉన్న శిల్పారామాలను పూర్తి చేయటంతో పాటు ప్రతి జిల్లాకో శిల్పారామం నిర్మిస్తామని ప్రకటించారు. గుజరాత్‌లో పర్యాటక రంగానికి టాలీవుడ్ హీరో అమితాబచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని చెప్తూ ముఖ్యమంత్రి సలహాతో మన రాష్ట్రానికి కూడా ఓ అంబాసిడర్‌ను నియమించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేపడతామన్నారు. సింగిల్ విండో ద్వారానే అనుమతులు మంజూరవుతాయని స్పష్టం చేశారు. పర్యాటక అభివృద్ధికి కేటాయించిన భూముల్లో నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరపకపోతే వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. పురావస్తుశాఖ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె ప్రవీణ్‌కుమార్, పురావస్తుశాఖ మ్యూజియంల కమిషనర్ డాక్టర్ జి వాణీమోహన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.