బిజినెస్

సింగరేణిలో వౌలిక వసతులకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సింగరేణి ఏరియా చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో వౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు.
బుధవారం హైదరాబాద్ సచివాలయంలో సీఎం కేసీఆర్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్. నర్సింగరావు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సింగరేణిలో చేపట్టిన పనుల ప్రగతిపై ప్రభుత్వ అధికారులకు వివరించారు. సింగరేణి డీఎంఎఫ్‌టీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనితీరుపై అధికారులకు నివేదికలను అందజేశారు.
సింగరేణి కార్మికులు స్వంతంగా నిర్మించుకున్న స్థలాలకు పట్టాల మంజూరుపై ఆయా ప్రాంతల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు (ఎమ్మెల్యేలకు) చేపట్టిన పనులపై గణాంకాలతో సహా నిధుల విడుదల, ఖర్చులపై లెక్కల చిట్టాను అధికారులకు అందజేశారు. సింగరేణి ఆరు జిల్లాల్లో 1713 ఎకరాల భూమిని సంబంధిత జిల్లా అధికారులకు అప్పగించినట్లు ఆయన గుర్తు చేశారు. సింగరేణి ఏరియా సమీప గ్రామాల కోసం ఉద్దేశించిన డిస్ట్రిక్ మినరల్ ఫండ్ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు రూ.1844 కోట్లను జిల్లా కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేశామన్నారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు వనమా వేంకటేశ్వరరావు( కొత్త గూడెం) గండ్రా వెంకటరమణారెడ్డి( భూపాలపల్లి) బాల్క సుమన్ ( చెన్నూర్) ఆత్రం సక్రు( ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక) ఉన్నారు.
చిత్రం...సింగరేణి ఏరియా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన
వివరాలను ప్రభుత్వ అధికారులకు వివరిస్తున్న దృశ్యం.