బిజినెస్

గత ఏడాది భారత్‌లో 42 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 13: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 2018లో 6 శాతం పెరిగాయి. ఆ ఏడాది కాలంలో మొత్తం 42 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు భారత్‌కు సమకూరాయి. ప్రధానంగా తయారీ రంగంతోబాటు, సమాచార, ఆర్థిక రంగాల్లోకి అధిక శాతం పెట్టుబడులు వెల్లువెత్తాయి. భారత ప్రభుత్వం చేపట్టిన సరిహద్దుల విలీనం, భూ సేకరణ చర్యల వంటివి పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేశాయని ఐక్య రాజ్య సమితి అధ్యయన నివేదిక వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐల సమీకరణలో అగ్రభాగాన నిలిచిన తొలి 20 దేశాల జాబితాలో భారత్‌కూ స్థానం కల్పిస్తూ ఐరాస ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ మేరకు ‘ప్రపంచ పెట్టుబడుల నివేదిక-2019’ని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్‌మెంట్’ విభాగం బుధవారం నాడిక్కడ విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే అంతకు క్రితం రెండేళ్లతో పోలిస్తే వరుసగా వచ్చిన వార్షిక పెట్టుబడులు 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.3 ట్రిలియన్ డాలర్లకు తగ్గగా 2018లో ఈ ఎఫ్‌డీఐలు 13 శాతం తగ్గాయని నివేదిక వెల్లడించింది. ఐతే ఆసియా ఖండంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రం 2018లో ఎఫ్‌డీఐల రాక 3.9 శాతం పెరిగిందని, ఈ మొత్తం 512 బిలియన్ డాలర్లకు చేరిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్, ఇండోనేషియా, భారత్, టర్కీ తదితర దేశాలకు ఎఫ్‌డీఐలు అధిక స్థాయిలో వచ్చాయని వివరించింది. మొత్తం అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పెట్టుబడుల్లో 39 శాతం ఆసియా దేశాల్లోకే వెళ్లాయని తెలిపింది. 2017 కంటే ఇది 33 శాతం అధికమని ఐరాస నివేదించింది. దక్షిణాసియా దేశాల్లోకి ఎఫ్‌డీఐల రాక 54 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 3.5 శాతం అధికమని తేల్చింది. కాగా ఆసియా ఉపఖండ దేశాల్లో అత్యధికంగా భారత్‌కు ఎఫ్‌డీఐలు వచ్చాయని నివేదిక తెలిపింది. ఈ ఉపఖండ దేశాల నుంచే భారత్‌కు సుమారు 70 నుంచి 80 శాతం పెట్టుబడులు సమకూరాయని నివేదిక వివరించింది. కాగా ఫ్లిప్‌కార్ట్ వంటి భారీ ఈకామర్స్ సంస్థలకు భారత్‌లో వాణిజ్య భాగస్వామ్యం కలగడం వల్ల అమెరికాకు చెందిన వాణిజ్య దిగ్గజం వాల్‌మార్ట్ వంటి సంస్థల నుంచి పెట్టుబడులు పెద్ద స్థాయిలో వచ్చాయని ఐరాస తెలిపింది. వడాఫోన్ (బ్రిటన్), అమెరికన్ టవర్ కంపెనీలతో భారత్ వాణిజ్య సంబంధాల వల్ల సైతం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. భారత్, యూఏఈలకు 2021 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పర్యావరణ రక్షణ, పచ్చదనం అభివృద్ధి చర్యలు సైతం భారత్‌కు ఎఫ్‌ఢీఐలను పెంచాయని నివేదిక తెలిపింది.