బిజినెస్

బ్రిక్స్ సమావేశానికి వర్కింగ్ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: వచ్చే నెల 14 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో నిర్వహించనున్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పట్టణీకరణ, సదుపాయాల కల్పన తదితర అంశాలపై జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులో పలు కీలక నిర్ణయలు తీసుకోనున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 30న విశాఖ పర్యటన సందర్భంగా సమీక్షించనున్నారు. పట్టణీకరణ వేగవంతంగా జరుగుతోందని, ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రూపుదిద్దుకుంటున్న పట్టణాల్లో వౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సభ్య దేశాల ప్రతినిధులు కీలక చర్చ జరపనున్నారు. సభ్య దేశాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, వాటి అమలు అంశాలను చర్చించి, పరస్పరం సాంకేతిక సహకారం అందించుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు, డెలిగేట్స్ హాజరుకానున్న దృష్ట్యా వారి భద్రత, ఆతిథ్యం వంటి అంశాల్లో ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 30న సిఎం పర్యటన పురస్కరించుకుని 26 నాటికే ప్రభుత్వ శాఖలు తమ నివేదికలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.