బిజినెస్

సహకార బ్యాంక్ అధ్యక్షుడికి రెస్పాన్స్‌బుల్ బిజినెస్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి (వరంగల్): ముల్కనూరు సహకార బ్యాంక్ అధ్యక్షుడు అల్గీరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ‘రెస్పాన్స్‌బుల్ బిజినెస్’ అవార్డును సూక్ష్మ, చిన్నపరిశ్రమల కేంద్ర మంత్రి ప్రతాప్‌చంద్ర సరంగి చేతుల మీదుగా శనివారం అందుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మందికి ‘రెస్పాన్స్‌బుల్ బిజినెస్’ అవార్డు అందించారు. దివంగత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్ర్తి ఫౌండేషన్ కింద ఆయన కుమారుడు సునీల్‌శాస్ర్తీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా ఇంటర్‌నేషన్ బిజెనెస్ సమ్మిట్ సమావేశంలో ఈ అవార్డును కేంద్ర మంత్రి అందించారు. భారతదేశంలోని వివిధ రంగాలల్లో ప్రజలకు, రైతులకు వారి సంస్థలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కార్యక్రమంలో జార్జీయా, గావన్, సౌతాఫ్రికా మూడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రవీణ్‌రెడ్డికి అవార్డు రావడం పట్ల వరంగల్ అర్బన్ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముల్కనూరు జీఎం మారుపాటి రాంరెడ్డి, ఎజీఎం వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.