బిజినెస్

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్: ఉల్లిగడ్డ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇంతలా ఉంటే.. మున్ముందు ఏలా ఉంటాయో అని సగటు వినియోగదారుడు ఆశ్చర్యానికి గురవుతున్నాడు. సాధారణంగా ప్రతి ఏడాది వర్షాకాలంలో ఉల్లి ధరలు పెరుగుతాయి. కానీ, ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం నుంచే ధరలు పెరుగుతున్నాయంటే.. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? లేదంటే మార్కెట్‌కు ఉల్లిగడ్డ అనుకున్న స్థాయిలో దిగుమతి కావడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందని వినియోగదారులు అంటున్నారు. వర్షాలు పడక ముందే ఉల్లిగడ్డ ధర మార్కెట్‌లో కిలో రూ.30కి పైగా ఉంటే, వర్షాకాలంలో ఇంకా ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి చేస్తున్న ఉల్లి వ్యాపారులతో ఇక్కడి వ్యాపారులు కుమ్మక్కై ఉల్లిగడ్డ సరఫరాను తగ్గించేస్తుండటం వల్ల క్రమంగా ఉల్లిగడ్డ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో ఉల్లిగడ్డ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. షాద్‌నగర్‌లోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడుచౌదరిగూడ మండలాల పరిధిలోని వివిధ మార్కెట్‌లకు హైదరాబాద్, శంషాబాద్ నుంచి ఉల్లిగడ్డ దిగుమతి అవుతోంది. హైదరాబాద్, శంషాబాద్ మార్కెట్‌లకు మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి వచ్చే ఉల్లి దిగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిగడ్డ దిగుమతులు పెరిగాయి. రెండు రోజుల్లో క్వింటాల్ ఉల్లిగడ్డ ధర రూ.200 నుంచి రూ.250 వరకు పెరిగింది. తెలంగాణ జిల్లాల నుంచి ఆశించిన స్థాయిలో ఉల్లిగడ్డ దిగుమతి రాకపోవడం.. వ్యాపారులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయని వినియోగదారులు అంటున్నారు.