బిజినెస్

రాష్ట్ర ప్రభుత్వంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: మీ సేవా పోర్టల్ వినియోగదారులకు చెల్లింపుల సేవలు అందించేందుకు వీలుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్, రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల సేవలను అందిస్తారు. ఈ వివరాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ రాయ్ చెప్పారు. మీ సేవ పోర్టల్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా సాలీనా వంద మిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు, అమలు చేస్తున్న ప్రణాళికలకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.