బిజినెస్

ఎయిర్ న్యూజిలాండ్ చీఫ్ పదవికి లక్సన్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్‌టన్, జూన్ 18: ఎయిర్ న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లక్సన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.
ఏడు సంవత్సరాలపాటు సంస్థలో ముఖ్య భూమిక నిర్వహించిన లక్సన్ రాజీనామాపై వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్సన్ రాజకీయా ల్లో చేరుతారన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ కన్సర్వేటివ్ పార్టీలో ప్రధాన పాత్ర వహించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రాజీనామా అనంతరం ఏం చేయాలన్న అంశంపై కొంత సమయం తీసుకొంటానని లక్సన్ పేర్కొన్నారు. రాజీనామా తరువాత నేనేమి చేస్తానన్న ప్రశ్న జనంలో తలెత్తుతుందని నేను భావిస్తున్నానని 48 ఏళ్ల లక్సన్ అన్నారు. ‘నా ఇద్దరు పిల్లలు స్కూలింగ్ పూర్తి చేయనున్నారు. నేను, నా భార్య కెరీర్ పరంగా స్వేచ్ఛను కోరుకొంటున్నాం’ అని ఇల్సన్ స్పష్టం చేశారు. కాగా, నేషనల్ కన్సర్వేటివ్ పార్టీలో తమ పార్టీ అధినేత సైమన్ బ్రిడ్జెస్ ప్రభావం వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతుందోనని ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. లక్సన్‌కు రాజకీయాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో నేషనల్ కన్సర్వేటివ్ పార్టీకి ఆయన నాయకత్వం వహించే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తవౌతున్నాయి. గత ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలోనే ఎన్‌సీపీలో సంస్కరణలు అవసరమన్న అభిప్రాయాలు సైతం పార్టీలో వినిపిస్తున్నాయి.
అయితే, పార్లమెంట్‌లో కొన్ని సంవత్సరాల పాటు అనుభవం ఉన్న వ్యక్తికి మాత్రమే పార్టీని పటిష్టం చేసే సత్తా ఉంటుందని కూడా అంటున్నారు. కాగా, 2011లో ఎయిల్ న్యూజిలాండ్‌లో చేరక ముందు లక్సన్ కెనడా యూనిలివర్స్ సంస్థ అధ్యక్షుడిగా పనిచేవారు.