బిజినెస్

దళారీ వ్యవస్థ నిర్మూలనకే ధరల స్థిరీకరణ నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 19: దళారీల బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మోపిదేవి మాట్లాడుతూ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు ఎదురైనప్పుడు రైతులు నష్టపోకుండా వారిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డు, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.
వైసీపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని వేశామని, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాలన కొనసాగిస్తారని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి గుంటూరు విచ్చేసిన మోపిదేవి వెంకట రమణకు కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, జెసి హిమాన్షు శుక్లా, డిఆర్‌డిఎ పిడి హుస్సేన్, ఎమ్మెల్యే మహమ్మద్ ముస్త్ఫా తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
చిత్రం... విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మోపిదేవి వెంకట రమణ