బిజినెస్

కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 20 : సిద్దిపేట జిల్లా కేంద్రానికి కాలానికి అనుగుణంగా ఎస్‌బీఐ, ఆంధ్రబ్యాంక్ రీజనల్ కార్యాలయాలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించే ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం భవన నిర్మాణానికి మాజీ మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధితో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ సిద్దిపేట బైపాస్ రోడ్డులో రహాదారి వెంట బిజినెస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చాల రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్ట్లు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఈ రహదారి బిజినెస్ స్ట్రీట్‌గా మారుతుందన్నారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ఎస్‌ఐబీ బ్యాంకు ఉద్యోగుల నివాసం కోసం అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. ఏడాది లోపు ఈ భవనాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. వచ్చే సంవత్సరం ఈ భవనాన్ని ప్రారంభం చేసుకుందామన్నారు. గతంలో రీజినల్ ఆఫీస్ అంటే హైదరాబాద్ వెళ్లి ఇబ్బందులు పడేవారన్నారు. ప్రజలు రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా లావాదేవీలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఇక్కడ త్వరలోనే రీజినల్ ఏడీబీ ఎస్‌బీఐ వస్తుందన్నారు. గత ఏడాది సిద్దిపేటకు క్లిన్ అండ్ గ్రీన్ అవార్డు వచ్చిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో ఆంధ్రా బ్యాంక్ రీజనల్ కార్యాలయం వస్తుందన్నారు. సిద్దిపేటలో రైల్వైలైన్, పోలీసు కమిషనరేట్, కలెక్టరేట్, రెండు మెడికల్ కళాశాలలు, ఫారెస్టు కాలేజీ, కేంద్రీయ విద్యాలయంతో పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నూతనంగా నిర్మించే కలెక్టరేట్, మెడికల్ కళాశాలల్లో ఎస్‌ఐబీ బ్రాంచిని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో 30 స్వయం సహాయక బృందాలకు 1.50 కోట్లు, 20 డైరీ యూనిట్లకు 20 లక్షలు చెక్కులు పంపిణీ చేశారు. 26 సెల్ఫ్ ఎంపాయాస్ గ్రూపులకు 10.05 కోట్ల చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎస్‌బిఐ చీఫ్ మేనేజర్ ప్రకాశ్ మిశ్రా, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...ఎస్‌బీఐ రీజనల్ కార్యాలయం నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన హరీశ్‌రావు