బిజినెస్

కోలుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ: భారత స్టాక్ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అత్యంత స్వల్పంగా లాభపడిన సూచీలు గురువారం మరింత పుంజుకున్నాయి. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఆటోస్ట్ఫా రంగాలు లాభాల్లో నడవగా, అంతర్జాతీయ మార్కెట్లు కూడా సహకరించాయి. వడ్డీరేటు తగ్గించనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సూచన ప్రాయంగా తెలియజేయడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు లాభాల పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛెంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 488.89 పాయింట్లు పెరిగి 39,601.63 పాయింట్లకు చేరింది. ఒకానొక దశలో సెనె్సక్స్ 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత క్రమంగా మందగించినప్పటికీ సుమారు 500 పాయింట్లకు చేరడం విశేషం. ఇన్‌ట్రాడేలో సెనె్సక్స్ 39,638.64 పాయింట్ల వరకు వెళ్లడం భావి మార్కెట్ ట్రెండ్స్‌కు అద్దం పడుతోంది. కాగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 140.30 పాయింట్లు పెరిగి 11,831.75 పాయింట్లకు చేరింది. ఇన్‌ట్రాడే లావాదేవీల్లో అత్యధికంగా 11,843.50, అత్యల్పంగా 11,637.75 పాయింట్లు నమోదైనప్పటికీ మధ్యంతరంగా నిఫ్టీ ముగిసింది. సెనె్సక్స్ ఎస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 10.94శాతం లాభాలను ఆర్జించాయి. సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, బజాజ్ ఆటో, టాటా మోటర్స్, ఓఎన్‌జీసీ షేర్లు సగటున 4.01 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ కంపెనీలు షేర్లు నష్టాలను ఎదుర్కొంది. ఇలా ఉంటే జెట్‌ఎయిర్ వేస్ షేర్ల ధర ఒక్కసారిగా పుంజుకొని, గత 13 సెషన్స్‌లో ఎన్నడూ లేని విధంగా 93శాతం పెరిగింది. స్థూలంగా చూస్తే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న వార్త జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ త్వరలోనే ఈ నిర్ణయం తీసుకుంటాయన్న వార్త మార్కెట్లకు కొత్త ఊతాన్ని ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గడం కూడా స్టాక్ మార్కెట్ లాభాలకు కారణమయింది.