బిజినెస్

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. ఈ నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న క్రమంలో సూచీలకు ఒడిదుడుకులు తప్పలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానంపై ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ప్రసంగించనున్న క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులపై కొంత ఊగిసలాటకు గురయ్యారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 65.94 పాయింట్లు పడిపోయి 24,900.46 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.10 పాయింట్లు కోల్పోయి 7,597 వద్ద నిలిచింది. సోమవారం సెనె్సక్స్ 371 పాయింట్లు, నిఫ్టీ 101 పాయింట్లు పతనమైనది తెలిసిందే. ఉత్పాదక నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నుంచి హెచ్చరికలు జారీ కావడం ఔషధరంగ సంస్థలను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. ఇక ఆయా రంగాలవారీగా హెల్త్‌కేర్ 2.59 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.99 శాతం, విద్యుత్ 0.83 శాతం, యుటిలిటీస్ 0.76 శాతం, ఐటి 0.41 శాతం, ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు 0.39 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే టెలికామ్ 1.59 శాతం, ఆటో 0.89 శాతం, మెటల్ 0.40 శాతం, బ్యాంకింగ్ రంగాల షేర్లు 0.39 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆరంభంలో లాభాలను అందుకున్నాయి.