బిజినెస్

91 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 22: ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియామకం.. ద్రవ్యోల్బణ ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపాయి. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇనె్వస్టర్లు ఆచితూచి లావాదేవీలు సాగించారు. దీని ప్రభావం పలు రకాల షేర్లపై పడటంతో లావాదేవీలు ముగిసే సమయానికి 91 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 28 వేల మార్కు వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లు ఊగిసలాట చందంగా సాగడానికి ఐరోపా, ఆసియా ఇనె్వస్టర్లు ఉత్సాహంగా ముందుకు రాకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ రిజర్వు రేటు పెరిగే అవకాశం ఉండటం కూడా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం మరో 19 పైసలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రారంభంలో 28,088.07 పాయింట్ల వరకు వెళ్లిన సెనె్సక్స్ ఒక దశలో 28,143 పాయింట్లకు కూడా చేరుకుంది. నికరంగా వచ్చిన విదేశీ నిధుల నేపథ్యంలో బ్లూచిప్ కంపెనీలకు చెందిన స్టాక్‌ల కొనుగోళ్లు వ్యూహాత్మకంగా జరిగాయి. అనంతరం ప్రతికూల పరిస్థితులు తలెత్తడంతో సెనె్సక్స్ 27,918.05 పాయింట్లకు చేరుకుంది. ఈరకంగా మార్కెట్ అతితక్కువ పాయింట్లను కోల్పోవడం గత పది రోజుల్లో ఇదే మొదటిసారి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా తీవ్రస్థాయిలో వత్తిడికి గురైంది. అంతిమంగా 37.75 పాయింట్లు కోల్పోయి 8,629.15 వద్ద ముగిసింది.