బిజినెస్

ఇండస్‌ఇండ్ బ్యాంకుకు హిందూజాల ఆర్థిక సాయం రూ.2,700 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 23: ఇండస్‌ఇండ్ బ్యాంకు మూలధన బలోపేతానికి హిందూజాలు రూ. 2,700 కోట్ల నిధులను సమకూర్చడం జరుగుతుందని సంబంధింత సీనియర్ అధికారి ఒకరు ఆదివారం నాడిక్కడ వెల్లడించారు.
ఇండియన్ ఫైనాన్షియల్ కంపెనీతో ఈ ప్రైవేటు బ్యాంకు విలీనం తర్వాత వారెంట్ వారంటు ద్వారా తమ సహకారం కొనసాగుతుందని హిందూజా తెలిపింది. వచ్చే జూలై 4 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. ‘మా ప్రమోటర్ రూ.2,700 కోట్ల రూపాయల నిధులిచ్చి 15 శాతం వాటాలను వెనక్కు తీసుకోనున్నారని ఇండస్‌ఇండ్ బ్యాంకు వ్యూహాత్మక విభాగం అధిపతి సంజయ్ మాలిక్ విలేఖరులకు తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తవుతూనే నాలుగోవంతు సొమ్ము వస్తుందని, మిగిలిన మొత్తం 18 నెలల కాలంలో అందుతుందని ఆయన వివరించారు. బీఎస్‌ఈలో ఈ బ్యాంకు వాటా విలువ గడచిన శుక్రవారం స్టాక్ మార్కెట్ల లావాదేవీలు ముగిసే నాటికి రూ. 1,709గా ఉంది. దీన్ని రూ. 1,448.70 రూపాయల వంతున సబ్సిడీ ప్రాతిపదికన హిందుజాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రమోటర్లు వారెంట్లను సబ్‌స్క్రైబ్ చేసి వారి వాటా శాతాన్ని రెగులేటర్ నిబంధనల మేరకు 15 కు పెంచుకోవడానికి వీలుగా వాటా విలువను 13 శాతం తగ్గిస్తున్నట్టు సంజయ్ మాలిక్ తెలిపారు.