బిజినెస్

2017 ఏప్రిల్ నుంచి అమెరికాలో 9100 మంది నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు అమెరికాలో 9,100 మందిని నియమించుకున్నట్టు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదివారం నాడిక్కడ తెలిపింది. ఇందువల్ల అమెరికాలో మొత్తం 10 వేల మందిని నియమించుకోవాలన్న తమ కంపెనీ లక్ష్య సాధనకు చేరువయ్యామని పేర్కొంది. అంతేకాకుండా వాణిజ్య విస్తరణకు సైతం దోహదం కలిగిందని తెలిపింది. ప్రతిభ, అర్హతలు కలిగిన వ్యక్తులకోసం వీసా వంటి వాటికోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా పోయిందని ఇన్ఫోసిస్ సీఓఓ యూవీ ప్రవీణ్‌రావు ఆదివారం నాడిక్కడ జరగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. అమెరికాలోని సుమారు 10 వేల మంది స్థానికులను రెండేళ్ల పాటు నాలుగు సాంకేతిక, పరిశోధనాత్మక హబ్‌ల్లోకి నియమించుకుంటామని 2017మేలో తమ కంపెనీ వెల్లడించిన విషయాన్ని ప్రవీణ్‌రావు గుర్తు చేశారు. బెంగళూరు ప్రధానంగా నడుస్తున్న ఇన్ఫోసిస్ ఇతర కంపెనీల్లాగే తమకు కీలక మార్కెట్లున్న దేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో స్థానికులనే నియమించుకునే ప్రక్రియను చేపట్టింది. ప్రధానంగా వివిధ దేశాలు వర్క్ వీసాలపై స్క్రూటినీని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వివిధ కంపెనీలు ఈ ప్రక్రియవైపు మళ్లాయి. ప్రధానంగా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి, సమస్య పరిష్కారానికి అనుగుణంగా అసరమైన నిపుణత, సహ సృజనాత్మకత, సహ పరిశోధనాత్మకత విధానాలతో దీర్ఘకాల క్లయింట్లను ఏర్పరచుకోవాలన్నది తమ కంపెనీ లక్ష్యమని ఇన్ఫోసిస్ అంటోంది. ఇప్ఫోసిస్‌కు ఉత్తర అమెరికా ప్రధాన మార్కెట్ కేంద్రంగా ఉంది. మొత్తం వాణిజ్యంలో 61.2 శాతం అక్కడే ఉంది. ఐరోపాలో 24 శాతం ఉండగా మిగిలిన ప్రపంచ దేశాల్లో 12.5 శాతం మార్కెట్ ఉంది. ఇందులో గత మార్చి త్రైమాసికానికి భారత్‌లో 2.3 శాతం వాణిజ్యం జరిగింది. ఈ త్రైమాసికంలో ఈ సంస్థ ఆదాయంలో 19.1 శాతం వృద్ధి నమోదైంది.