బిజినెస్

శ్రీసిటీలో కొత్త పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఆగస్టు 22: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీలో సోమవారం రెడ్‌స్టార్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారానికి భూమి పూజ నిర్వహించారు. ఆ పరిశ్రమల మేనేజింగ్ డైరక్టర్ తనిష్‌క కార్తికేయన్ భూమిపూజలో పాల్గొని ప్రసంగిస్తూ 10 కోట్ల పెట్టుబడులతో సిటిజెడ్ జోన్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ 2017 ఏప్రిల్ నాటికి ఉత్పత్తులను ప్రారంభించనున్నదని, ప్రధానంగా పివిసి బాండింగ్ టేప్‌లుతయారు చేస్తామన్నారు. ఫర్నిచర్ తయారీలో వీటిని వినియోగిస్తారని, ఈ పరిశ్రమ ద్వారా 40 శాతం మార్కెట్ సాధించాలన్నది తమ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు సరిపడా సుమారు 70 శాతం వీటిని దిగుమతి చేసుకొంటున్నామని, రెడ్‌స్టార్ కంపెనీ ద్వారా సుమారు 100 మందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు.

చిత్రం..ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న రెడ్‌స్టార్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం