బిజినెస్

విద్యుత్ వాహనాలపై పన్ను తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే విద్యుత్ వాహనాలకు పన్నును తగ్గించే విషయాన్ని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు వరుణ్ గాంధీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం జీఎస్‌టీ మండలి వద్ద పెండింగ్‌లో ఉందని, త్వరలో నిర్ణయం జరుగుతుందని మంత్రి ఠాకూర్ తెలిపారు. జీఎస్‌టీ కింద పన్ను ఫైలింగ్‌లు ప్రస్తుతం ద్విగుణీకృతం అయ్యాయని, దీన్నిబట్టి ప్రజలు ఈ కొత్త పన్ను విధానంపై విశ్వసనీయతతో ఉన్నారన్న విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పరోక్ష పన్నులను ఒక తాటిపైకి తీసుకువచ్చి సరళతరం చేయడం వంటి అనేక వ్యాపారుల ప్రయోజన కార్యక్రమాలపై జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మంత్రి సభ దృష్టికి తెచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలోని వారికి సైతం రూ. 92 వేల కోట్ల ప్రయోజనం చేకూరిందన్నారు. గత నెలలో కేవలం ఒక్క రోజులోనే 21 లక్షల రిటర్న్స్ ఫైల్ అవడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. ఈ పన్ను విధానంలో ఆరంభంలో కొన్ని లోటుపాట్లు తలెత్తినా వాటిని సరిచేసి నిర్ధిష్టమైన శాశ్వత విధానాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పన్ను వసూళ్లు 8.5 శాతం పెరిగాయని తెలిపారు. అలాగే పన్ను వసూళ్లపై పూర్తి లిఖిత పూర్వక సమాధానాన్ని మంత్రి సభకు అందజేశారు. 2018-19లో పూర్తి ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 11,37,685 కోట్లు వసూలయ్యాయని, 2017-18లో ఈ వసూళ్లు రూ. 10,02,037 కోట్లని తెలిపారు. ప్రత్యక్ష పన్ను జీడీపీ నిష్పత్తి సైతం 5.86 శాతం నుంచి 5.98 శాతానికి పెరిగిందని వివరించారు. 2018-19లో జీఎస్‌టీ వసూళ్లు రూ. 5.81,563 కోట్లు జరగ్గా, 2017-18లో రూ. 4,42,561 కోట్లు మాత్రమే జరిగినట్టు తెలిపారు. ఇక నాన్ జీఎస్‌టీ పరోక్ష పన్ను వసూళ్లు రూ. 3,55.906 కోట్ల మేర జరిగినట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ సభకు వివరించారు.