బిజినెస్

నల్లధనం 216-490 బిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: విదేశాల్లో ఉంటున్న భారతీయుల లెక్కలేని సంపద దాదాపు 216-490 బిలియన్ డాలర్ల మేర ఉందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. 1980-2010 మధ్య కాలంలో విదేశాల్లోని భారతీయులకు లెక్కల్లోకి రాని సంపద మొత్తం ఈ మేరకు నమోదయిందని ఎన్‌ఐపీఎఫ్‌టీ, ఎన్‌సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎం అనే మూడు సంస్థలు వెలుగులోకి తెచ్చాయి. రియల్ ఎస్టేట్ గనులు, ఫార్మా, పాన్ మసాలా, గుట్కా బులియన్, సినిమా వంటి రంగాల్లోనే ఈ అక్రమ సంపద ఉందని ఈ సంస్థలూ తమ అధ్యయనంలో భాగంగా వెల్లడించాయని సోమవారం లోక్‌సభలో స్థాయి కమిటీ నివేదిక ద్వారా బయటపెట్టారు. నల్లధనం ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? అది ఎంత మేరకు ఉంది? ఎలా విదేశాలకు తరలిపోతుందనే దానిపై విశ్వసనీయమైన వివరాలేవీ లేవని ఈ కమిటీ నివేదిక వెల్లడించింది. ‘్భరత్‌లోనూ బయట నల్లధనం, సంపద అన్న శీర్షికతో ఈ నివేదికను ప్రవేశపెట్టారు. నల్లధనాన్ని లేదా సంపదను ఏ విధంగా వెలికి తీయాలి? లేదా అంచనా వేయాలన్న దానిపై స్పష్టమైన విధానం లేదని ఈ నివేదిక తెలిపింది. 1980-2010 మధ్య కాలంలో విదేశాల్లో పేరుకుపోయిన భారత నల్లధనం మొత్తం 384 బిలియన్ డాలర్ల నుంచి 490 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చునని అనువర్తిత ఆర్థిక జాతీయ పరిశోధనా మండలి (ఎన్‌సీఏఈఆర్) వెల్లడించింది. భారత్ నుంచి తరలిపోయిన నల్లధనం మొత్తం విలువ (1990-2008) 9,41,837 కోట్ల రూపాయలని మరో సంస్థ తెలిపింది. నల్ల ధనం, అక్రమ సంపదపై సర్వే జరపాలని, వీటి మొత్తం ఎంతో మదింపు చేయాలని ఈ మూడు శాఖలను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. దాని ప్రకారమే దేశంలోనూ, వెలుపల ఈ అక్రమ సంపదల వివరాలను సేకరించి నివేదికను సమర్పించాయి. అయితే ఈ మూడు సంస్థలు వ్యక్తిగతంగా సేకరించిన వివరాల్లో పొంతన లేకపోవడాన్ని బట్టి చూస్తే అక్రమ సంపద, నల్లధనం మదింపునకు ఓ స్పష్టమైన అంచనా ఏదీ లేదన్న విషయం స్పష్టమవుతుంది. అయితే ఈ మూడు నివేదికలను క్రోడీకరించి అక్రమ సంపద, నల్లధనం పై ఒకే రకమైన అంచనాకు వచ్చే అవకాశం లేదని ప్రధాని ఆర్థిక సలహాదారు స్పష్టం చేశారు.