బిజినెస్

8 శాతానికి తగ్గనున్న మొండి బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 25: రుణ బకాయిల వసూళ్లు భారీగా పెంచడం, మొండి బకాయిల శాతాన్ని తగ్గించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన బ్యాంకుల తీరు నిరర్ధక ఆస్తులను తగ్గించడంలో సత్ఫలితాలిస్తోంది. 2020 మార్చి నాటికి నిరర్థక రుణాలు (ఎన్‌పీఏ)లు 8 శాతానికి దిగివచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘క్రిసిల్’ నివేదిక స్పష్టం చేసింది. 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్వవస్ధలో నిరర్థక రుణాలు 11.5 శాతానికి చేరుకుని ప్రమాదకర సంకేతాలిచ్చాయి. దీంతో చేపట్టిన జాగ్రత్త చర్యల కారణంగా 2019 మార్చి నాటికి ఎన్‌పీఏ రేటు 9.3 శాతానికి దిగివచ్చింది. 2020లో బ్యాంకుల ఆస్తుల విలువ ప్రధాన అంశం కానుంది. గత రెండేళ్లుగా స్థూల ఎన్‌పీఏ 350 బేసిస్ పాయింట్లు తగ్గడం గమనార్హం. 2020 నాటికి ఇది 8 శాతానికి తగ్గుతుందని నివేదిక పేరొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రధానంగా 80 శాతం నిరర్థక ఆస్తులు కలిగివున్నాయని, ఇవి ఖచ్చితంగా తమ స్థూల ఎన్‌పీఏ 400 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేలా చూడాలని, ప్రత్యేకించి 2020 మార్చి నాటికి ఈ ఎన్‌పీఏ కనీసం 10.6 శాతానికి చేరాల్సిన ఆవవ్యకత ఉందని నివేదిక సూచించింది.
ఇది 2018లో 14.6 శాతంగా ప్రమాదక స్థాయిలో ఉంది. 2019లో ఈ ఎన్‌పీఏ రేటు 3.7 శాతం తగ్గగా, 2020 మార్చి నాటికి మరో 3.2 శాతం తగ్గే అవకాశాలున్నాయని నివేదిక అంచనావేసింది. బ్యాంకులు ఇప్పటికే 2016 నుంచి పేరుకుపోయిన 17 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను గుర్తించాయని, ఆర్బీఐ చేపట్టిన కఠినతర చర్యలు, విధానాల ద్వారా మొండి బకాయిల శాతాన్ని తగ్గించుకునేందుకు బ్యాంకులు నిర్థిష్టమైన చర్యలు చేపడుతున్నాయని నివేదిక వెల్లడించింది.