బిజినెస్

కొత్త మార్గంలో గూడ్స్ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే నూతన మార్గం అందుబాటులోకి వచ్చింది. ఓబులవారిపల్లి- వెంకటాచలం- కృష్ణపట్నం ఓడరేవుమధ్య రైల్వే మార్గంలో ఇక నుంచి గూడ్స్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం ఏర్పాటు చేసిన ఈ మార్గంలో గూడ్స్ సర్వీసులకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ముందు ఈ సదుపాయం లేనందున అదనపు భారంతో పాటు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేంది. వ్యయప్రయాసలతో పాటు ఇంధన ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారుల వ్యూహాత్మక ప్రణాళిక కార్యరూపం దాల్చింది. చెన్నై-హౌరా (వెంకటాచలం)- చెన్నై- ముంబయి (ఓబులవారిపల్లి) మార్గాలను అనుసంధానం చేయడంతో రైల్వే అధికారులు సఫలం అయ్యారు. నూతన రైల్వే మార్గంతో పాటు యద్ధప్రాతిపదికన విద్యుద్ధీకరణ పూర్తిచేశారు. ఈ రెండు మార్గాల మధ్య కేవలం 93 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు విశేష కృషి ఉందని చెప్పవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలో రవాణా అత్యధికంగా జరగడానికి, ఈ ప్రాంత అధివృద్ధికి కొత్త ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కృష్ణపట్నం ఓడ రేవుతో పాటు తీరప్రాంతాలకు రైలు మార్గం ఎంతో అనువైందిగా అధికారులు చెబుతున్నారు. బుధవారం ఈ మార్గంలో మొదటి గూడ్స్ ఎలక్ట్రిక్ ఇంజన్‌తో తోరణగల్లు నుంచి జిందాల్ స్టీల్‌ను కృష్ణపట్నం ఓడరేవుకు రవాణా చేశారు. ఈ మార్గం లేనప్పుడు రెండు మార్గాల్లో గూడ్స్ రైళ్లు నడిచేవి. ఒకటి గుంతకల్ నుంచి కడప రైల్వే కోడూరు, రేణిగుంట, గూడూరు మీదుగా కృష్ణపట్నం ఓడరేవుకు చేరేది. రెండో మార్గం గుంతకల్ నుంచి డోన్, నంద్యాల, మార్కాపురం, నరసరావుపేట, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా కృష్ణపట్నం ఓడరేవుకు వెళ్లేది. ప్రస్తుతం ఈ రెండు మార్గాలను కలుపుతూ ఓబులవారిపల్లి- వెంకటాచలం మధ్య నూతన రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి కృష్ణపట్నం ఓడరేవునుంచి బొగ్గు, ఇనుము, ఖనిజాలు, పరిశ్రమల ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి అడ్డుంకులు ఉండవు. పశ్చిమ ప్రాంతాల నుంచి గుంతకల్ డివిజన్ ద్వారా కృష్ణపట్నంకు వచ్చే రైళ్ల ప్రయాణ దూరం 72 కిలోమీటర్లు తగ్గుతుంది. ఓబులవారిపల్లి- రేణిగుంట- గూడూరు సెక్షన్‌లో ట్రాఫిక్ కూడా బాగా తగ్గుతుంది. విజయవాడ- గూడూరు, రేణిగుంట- గుంతకల్ సెక్ష్సన్‌లో ప్రయాణ సమయం, రాకపోకలు సులభతరం అవుతుంది.
చిత్రం...గూడ్స్ రైలును ప్రారంభిస్తున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు