బిజినెస్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో సరిహద్దు వాణిజ్యం సరళతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 28: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో సరిహద్దు వాణిజ్యం సరళతరమైందని విశాఖపట్నం పోర్టుట్రస్టు (వీపీటీ) డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ అన్నారు.
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, కేంద్ర నౌకాయాన సంస్థ, వీపీటీ సంయుక్తంగా పోర్టు కమ్యూనిటీ సిస్టమ్ 1 ఎక్స్ రోడ్ షోను విశాఖలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతులు తదితర అంశాల్లో నిబంధనలు, ఇతర అంశాలపై ట్రేడర్లకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో నిర్వహించాలని భావించగా తొలి సమావేశాన్ని వీపీటీ ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఎగుమతులు, దిగుమతుల విధానంలో అనుమతులు, ఇతర అంశాలను ట్రేడర్లు తెలుసుకునేందుకు ఇటువంటి సదస్సులు ఉపకరిస్తాయన్నారు.
గత రెండేళ్లుగా భారత ప్రభుత్వం వివిధ వాణిజ్య విభాగాలతో కలిసి అమలు చేస్తున్న నూతన విధానాల వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ స్థానం ఎంతో మెరుగైన స్థితికి చేరిందన్నారు. దీనిలో భాగమైన పోర్టు కమ్యూనిటీ సిస్టమ్ 1 ఎక్స్ సరిహద్దు వాణిజ్యాన్ని మరింత వేగవంతం, సరళతరం చేస్తుందన్నారు. గతంలో ఎగుమతులు, దిగుమతులకు పలు విభాగాల నుంచి అనుమతులు తీసుకోవడం ట్రేడర్లకు ఎంతో ఇబ్బంది కరంగా ఉండేదన్నారు. అయితే నిబంధనలను సరళతరం చేయడంతో పాటు అన్నింటినీ ఒకే సారి, ఒకే విధంగా పొందేందుకు వీలుగా చేపట్టిన సంస్కరణలు నౌకా వాణిజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయన్నారు. పోర్టు కమ్యూనిటీ సిస్టమ్ అనేది అత్యంత సులభతరమైన విధానమని, నౌకా వాణిజ్యంలో 27 విభిన్న విభాగాలను వినియోగించుకోవడంలో సరళమైన అంశంగా పేర్కొన్నారు. నూతన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకోవడంతో పాటు వాటిని అమలు చేసి, ట్రేడర్లకు సేవలందించడంతో వీపీటీ ముందు వరుసలో ఉందన్నారు. అందుకే తొలి రోడ్ షోను విశాఖ పోర్టు ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. కార్యక్రమంలో వివిధ పోర్టుల నుంచి వాణిజ్య విభాగం, షిప్పింగ్ ఏజెంట్స్, కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్, టెర్మినల్ ఆపరేటర్లు, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్, మెరైన్ విభాగం, పోర్టు ఆరోగ్య, కస్టమ్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ పోర్ట్ అసోసియేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి అరుణ్ చక్రవర్తి, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ధర్మరాజు, వీపీటీ ట్రస్టీ మూర్తి తదితరులు మాట్లాడారు.